టోక్యో ఒలింపిక్స్: మెన్స్ ఆర్చరీ సింగిల్స్‌లో అతానుదాస్ ఓటమి...

Published : Jul 31, 2021, 08:02 AM ISTUpdated : Jul 31, 2021, 08:29 AM IST
టోక్యో ఒలింపిక్స్: మెన్స్  ఆర్చరీ సింగిల్స్‌లో అతానుదాస్ ఓటమి...

సారాంశం

ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌లో జపాన్‌ అథ్లెట్ టకహరు ఫురుకవాతో జరిగిన మ్యాచ్‌లో భారత ఆర్చర్ అతానుదాస్ ఓటమి... బాక్సింగ్‌లో 52 కేజీల విభాగంలో రెండో రౌండ్‌లోనే ఓడిన టాప్ బాక్సర్ అమిత్ పంగల్..

టోక్యో ఒలింపిక్స్‌లో శనివారం ఆరంభంలో భారత్‌కి ఆశించని ఫలితాలు దక్కలేదు. ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌లో భారత ఆర్చర్ అతానుదాస్, జపాన్‌ అథ్లెట్ టకహరు ఫురుకవాతో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలయ్యాడు. ఐదు సెట్ల పాటు సాగిన ఈ హోరాహోరీ మ్యాచ్‌లో మొదటి సెట్ టకహరు సొంతం చేసుకోగా రెండో సెట్ టై అయ్యింది.

మూడో సెట్‌లో అతానుదాస్ విజయం సాధించగా, నాలుగో సెట్ టై‌గా ముగిసింది. కీలకమైన ఐదో సెట్‌లో ఒక్క పాయింట్ తేడాతో ఓడిన అతానుదాస్, క్వార్టర్ ఫైనల్స్‌కి అర్హత సాధించలేకపోయాడు.

అలాగే బాక్సింగ్‌లో 52 కేజీల విభాగంలో టాప్ బాక్సర్ అమిత్ పంగల్ రెండో రౌండ్‌లోనే ఓడి, తీవ్రంగా నిరాశపరిచాడు. మొదటి రౌండ్‌లో బై లభించడంతో నేరుగా రెండో రౌండ్ చేరిన అమిత్, కొలంబియాకు చెందిన హెర్నీ మార్టినెజ్‌తో జరిగిన మ్యాచ్‌లో 1-4 తేడాతో ఓడి, టోర్నీ నుంచి నిష్కమించాడు.

PREV
click me!

Recommended Stories

Asia Cup 2026 Final: ఆసియా కప్‌లో భారత్‌ను ఆపడం ఎవరి వల్ల కాదు.. మళ్లీ ఫైనల్‌కు టీమిండియా గ్రాండ్ ఎంట్రీ
స‌చిన్ టెండూల్క‌ర్‌కు ఎయిర్‌పోర్టులో మెట‌ల్ డిటెక్ట‌ర్ చెకింగ్ ఉండదు.. ఎందుకో తెలుసా.?