Tokyo Olympics: మరోసారి నిరాశపరిచిన భారత షూటర్లు, క్వాలిఫయర్స్ లో ఓటమి..!

By team teluguFirst Published Jul 27, 2021, 6:57 AM IST
Highlights

10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ మిక్స్డ్ ఈవెంట్లో భారత్ కు నిరాశే ఎదురయింది. మను బాకర్,సౌరభ్ చౌదరీల జంట స్టేజి2 కి క్వాలిఫయ అయినప్పటికీ... టాప్ 4 చేరలేక వెనుదిరిగింది. 

10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ మిక్స్డ్ ఈవెంట్లో భారత్ కు నిరాశే ఎదురయింది. స్టేజి2  కి క్వాలిఫై అయిన సౌరభ్ చౌదరి,మను బాకార్ల జంట టాప్ 4 చేరలేక ఎలిమినేట్ అయ్యింది. తొలి సిరీస్ లో మను బాకర్ కేవలం 92 పాయింట్లు మాత్రమే సాధించగా... సౌరభ్ 96 పాయింట్లు సాధించాడు. అత్యంత పోటీ నెలకొని ఉండే ఈ ఈవెంట్లో ఈ స్కోర్లు భారత షూటర్లకు శరాఘాతంగా మారి భారత మెడల్ ఆశలను ఛిద్రం చేసాయి. 

రెండవ సిరీస్ లో భారత షూటర్లు పుంజుకున్నప్పటికీ... వారిని టాప్ 4 లోకి తీసుకెళ్లడానికి మాత్రం ఆ స్కోర్లు సరిపోలేదు. తొలి సిరీస్ లో లౌ స్కోరింగ్ వల్ల ఈ జంట రెండవ రౌండ్లో కొంత పుంజుకున్నప్పటికీ... ఫలితం లేకుండా పోయింది. రెండవ సిరీస్ లో సౌరభ్ 98 సాధించగా, మను 94 పోయింట్లి మాత్రమే సాధించింది. 

దీనితో షూటింగ్ లో భారత్ అత్యధిక ఆశలు పెట్టుకున్న 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్లో భారత్ రిక్త హస్తాలతో వెనుదిరగవలిసి వచ్చింది. 

భారత్ ఈసారి షూటింగ్ ఈవెంట్ పై అనేక ఆశలు పెట్టుకుంది. వరల్డ్ టాప్ ర్యాంకర్లు భారత్ తరుఫున బరిలోకి దిగుతుండడం, వారి గురించి ప్రపంచమంతా చర్చించుకుంటూ ఉండడం, వారి సాధన కూడా పూర్తి స్థాయిలో ఉండడం అన్నీ వెరసి భారత్ బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. 

వ్యక్తిగత విభాగం కన్నా మిక్స్డ్ టీం ఈవెంట్లో పతకాలను ఖచ్చితంగా సాధించగలమనే నమ్మకం పెట్టుకుంది. నేటి ఉదయం ప్రారంభమైన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో భారత్ తరుఫున సౌరభ్ చౌదరి,మను బాకర్ ల జోడి, అభిషేక్ వర్మ,యశస్వినిల జోడి బరిలోకి దిగాయి. సౌరభ్ చౌదరి,మను బాకర్ ల జోడి స్టేజి 2 కి అర్హత సాధించగా... అభిషేక్ వర్మ,యశస్వినిల జంట టాప్ 8 లోకి చేరుకోలేక ఎలిమినేట్ అయింది. 

తొలి స్టేజి లో ప్రతి జోడికి పదేసి షాట్స్ చొప్పున మూడు రౌండ్లు కాల్చే అవకాశాన్ని ఇస్తారు. పోటీపడ్డ 20 జంటల్లో... టాప్ 8 స్థానాల్లో నిలిచిన వారికి రెండవ స్టేజిలో  పాల్గొనే అర్హత దక్కుతుంది. రెండవ స్టేజిలో పదేసి షాట్ల చొప్పున రెండు రౌండ్లతో ఈవెంట్ సాగుతుంది. ఇందులో టాప్ 4 మెడల్స్ కోసం పోటీపడతారు. 1,2 స్థానాల్లో నిలిచిన వారు గోల్డ్,సిల్వర్ కోసం పోటీ పడగా... 3,4 స్థానాల్లో నిలిచినవారు కాంస్య పతకం కోసం పోటీ పడతారు. 

సౌరభ్ చౌదరి తొలి స్టేజిలో 98,100,98 పాయింట్లను సాధించగా మను 97,94,95 పాయింట్లను సాధించింది. సౌరభ్ చౌదరి అత్యుత్తమ ఓరదర్శన వల్ల ఈ జంట స్టేజి2 లోకి దూసుకెళ్లింది. మరోపక్క అభిషేక్ 92,94,97 పాయింట్లు స్కోర్ చేయగా... యశస్విని 95,95,91 పాయింట్లు స్కోర్ చేయడంతో ఆ జంట 17వ స్థానంలో నిలిచి స్టేజి2 కి అర్హత సాధించలేక ఎలిమినేట్ అయ్యింది.  

click me!