టోక్యో ఒలింపిక్స్: భారత మహిళా హాకీ జట్టు మరో ఓటమి... జర్మనీ చేతిలో పరాజయం...

By Chinthakindhi RamuFirst Published Jul 26, 2021, 7:14 PM IST
Highlights

జర్మనీ చేతిలో 2-0 తేడాతో ఓడిన భారత హాకీజట్టు...

పెనాల్టీ స్ట్రోక్‌ను గోల్‌గా మలచలేకపోయిన భారత ప్లేయర్ గుర్‌జీత్ కౌర్...

టోక్యో ఒలింపిక్స్‌లో భారత మహిళా హాకీ జట్టు వరుసగా రెండో ఓటమి చవి చూసింది. నెదర్లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓడిన మహిళా హాకీ జట్టు, జర్మనీతో జరిగిన మ్యాచ్‌లో తేడాతో ఓడింది. 

ఆట 12వ నిమిషంలో దక్కిన పెనాల్టీ కార్నర్‌ను చక్కగా వినియోగించుకున్న జర్మనీ ప్లేయర్ నైక్ లోరెంజ్ తొలి గోల్ సాధించగా, భారత జట్టుకి దక్కిన పెనాల్టీ స్ట్రోక్‌ను భారత ప్లేయర్ గుర్‌జీత్ కౌర్ గోల్‌గా మలచలేకపోయింది. 

ఆ తర్వాత 35వ నిమిషంలో గోల్ చేసిన అన్నే స్రోడర్స్ జర్మనీ ఆధిక్యాన్ని 2-0కి పెంచింది. ఆ తర్వాత భారత జట్టు గోల్ చేసేందుకు విశ్వప్రయత్నాలు చేసినా, జర్మనీ చక్కగా డిఫెండ్ చేసింది. దీంతో జర్మనీ 2-0 తేడాతో మ్యాచ్‌లో విజయం సాధించింది. 

టోక్యో ఒలింపిక్స్‌లో సోమవారం టీమిండియాకి పెద్దగా కలిసిరాలేదు. భారత ఆర్చరీ పురుషుల టీమ్ క్వార్టర్ ఫైనల్స్‌లో ఓడగా, టీటీ ప్లేయర్ సుత్రీత, బ్యాడింటన్ డబుల్స్ ప్లేయర్లు సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి, ఫెన్సర్ భవానీ దేవీ రెండో రౌండ్‌లో ఓడారు.

భారత బాక్సర్ ఆశీష్ కుమార్ మొదటి రౌండ్‌లో ఓడగా భారత షూటర్లు అంగడ్ భజ్వా, మైరాజ్ ఖాన్ స్కీట్ ఈవెంట్‌లో 18, 25వ స్థానంలో నిలిచి ఘోరంగా విఫలమయ్యారు. టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్‌లో టీటీ ప్లేయర్ మానికా బత్రా కూడా వరుస సెట్లలో ఓడి పోటీ నుంచి నిష్కమించింది. 

భారత టెన్నిస్ ప్లేయర్ సుమిత్ నగల్ రెండో రౌండ్‌లో ఓడగా, వుమెన్ సెయిలర్ నేత్రా కుమారన్, పురుష సెయిలర్ విష్ణు శరవణ్ తీవ్రంగా నిరాశపరిచారు.  మెన్స్ సింగిల్స్‌లో శరత్ కమల్ మాత్రం రెండో రౌండ్‌లో గెలిచి, మూడో రౌండ్‌కి అర్హత సాధించడం ఒక్కటే భారత జట్టుకి దక్కిన విజయం.

click me!