Tokyo Olympics: ఉమెన్స్ లైట్ వెయిట్ లో భారత్ బాక్సర్ సిమ్రన్జీత్ ఓటమి

Published : Jul 30, 2021, 09:07 AM IST
Tokyo Olympics: ఉమెన్స్ లైట్ వెయిట్ లో భారత్ బాక్సర్ సిమ్రన్జీత్ ఓటమి

సారాంశం

భారత బాక్సర్ సిమ్రన్జీత్ కౌర్ థాయ్ బాక్సర్ సూడాపోన్ చేతిలో ఓటమి చెందింది. మహిళల 60 కేజీల రౌండ్ ఆఫ్ 16 లో సిమ్రన్జీత్ ఓటమి చెందింది.

భారత బాక్సర్ సిమ్రన్జీత్ కౌర్ థాయ్ బాక్సర్ సూడాపోన్ చేతిలో ఓటమి చెందింది. మహిళల 60 కేజీల రౌండ్ ఆఫ్ 16 లో సిమ్రన్జీత్ ఓటమి చెందింది. తొలి రౌండ్లో వాస్తవానికి తన ప్రత్యర్థిపై తాను పైచేయి సాధించానని సిమ్రన్జీత్ భావించినప్పటికీ... తను  సరిపోను పాయింట్లు స్కోర్ చేసిందని భావించినప్పటికీ... జడ్జిలస్కోరే అందుకు విరుద్ధంగా ఉండడం సిమ్రన్ పై భారీ ప్రభావాన్ని చూపెట్టినట్టుంది. 

రెండవ రౌండ్లో ప్రత్యర్థి పై పైచేయి సాధించడానికి గార్డ్ ను వదిలేసి ప్రత్యర్థి పై పంచులు కురిపించేందుకు యత్నించిన నేపథ్యంలో ప్రత్యర్థి అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని సిమ్రన్జీత్ పై పాయింట్లను సాధించింది. 

సిమ్రన్జీత్ పంచులు చాలా పవర్ఫుల్ గా ఉన్నప్పటికీ... థాయ్ బాక్సర్ తెలివిగా ఆడింది. అంతే కాకుండా కోవిడ్ తరువాత సిమ్రన్జీత్ కోలుకోవడానికి చాలా సమయమే పట్టింది. కోవిడ్ బారినప్పడినుండి ఆమె స్పీడ్,ఎండ్యూరెన్సు లో చాలా తేడాని గమనించవచ్చు. 

గతకొన్ని నెలలకింద వరకు భారత్ ఈ బాక్సర్ పై చాలా ఆశలు పెట్టుకున్నప్పటికీ... కోవిడ్ శారీరకంగా,మానసికంగా ఈ బాక్సర్ ని బాగా ఇబ్బంది పెట్టింది. మొత్తానికి ఈ బాక్సర్ ప్రయాణం టోక్యోలో ముగిసింది. 

ఇక భారత మహిళా షూటర్లు మను బాకర్,రాహి సర్నోబాత్ లు పిస్టల్ షూటింగ్ ఈవెంట్ లో నిరాశపరిచారు. నిన్నటి ప్రెసిషన్ రౌండ్ తరువాత నేడు జరిగిన రాపిడ్ స్టేజిలో వారు అధిక పాయింట్లను సాధించలేక ఫైనల్ కి అర్హత సాధించలేకపోయారు. మను 582 పాయింట్లను సాధించినప్పటికీ... అర్హత సాధించలేకపోయింది. అదే గత ఒలింపిక్స్ లో అయితే ఈ స్కోర్ కి సులువుగా అర్హత సాధించి ఉండేది. టోక్యోలో కాంపిటీషన్ ఏ లెవెల్ లో ఉందొ దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. 

PREV
click me!

Recommended Stories

IPL 2026 Auction: చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కెచ్.. రూ. 43 కోట్లతో ఆ ఆటగాళ్లపై కన్నేసిన సీఎస్కే !
IPL Mini Auction చరిత్రలో అత్యంత ఖరీదైన 6 ఆటగాళ్లు వీరే.. రికార్డులు బద్దలవుతాయా?