టోక్యో ఒలంపిక్స్: మీరా భాయి ఛాను విజయం వెనక కష్టం బెజవాడవాసిదే...

By telugu news teamFirst Published Jul 30, 2021, 8:50 AM IST
Highlights

జాతీయ, ఆలిండియా రైల్వే వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ లో పతకాలు కైవసం చేసుకున్నాడు. ఈ క్రమంలో.. కండరాలు సడలింపు కోసం ఫిజియోథెరపిస్ట్ శ్రీహరి వద్ద మసాజ్ చేయడం నేర్చుుకున్నాడు.

టోక్యో ఒలంపిక్స్ లో మనదేశానికి ఇప్పటికే ఓ పతకం వచ్చింది. వెయిట్ లిఫ్టింగ్ లో మణిపూర్ కి చెందిన  మీరాబాయి ఛాను.. రజతం గెలుచుకుంది. ఆమె పడిన కష్టం మనకు పతకం రూపంలో కనపడుతూనే ఉంది. అయితే.. ఆమె విజయం ఉన్న వ్యక్తి గురించి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆయన ఓ తెలుగువాడు కావడం గమనార్హం.

మీరాబాయికి మసాజర్ గా విధులు నిర్వహిస్తూ.. ఆమె పోషకాహారం అందిస్తూ.. పూర్తి సహకారం అందించాడు.. కందుకూరి వీర కోటేశ్వరరావు. ఆయన విజయవాడకు చెందిన వాడు  కాగా.. ఆయన గురించి పూర్తి వివరాలు తెలుసుకుందామా..

విజయవాడ రైల్వే స్టేషన్ లో రిజర్వేషన్ సూపర్ వైజర్ గా విధులు నిర్వర్తిస్తున్న కోటేశ్వరరావు స్వతహాగా వెయిట్ లిఫ్టర్ . స్పోర్ట్స్ కోటాలో 2006లో ఉద్యోగం సాధించాడు. జాతీయ, ఆలిండియా రైల్వే వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ లో పతకాలు కైవసం చేసుకున్నాడు. ఈ క్రమంలో.. కండరాలు సడలింపు కోసం ఫిజియోథెరపిస్ట్ శ్రీహరి వద్ద మసాజ్ చేయడం నేర్చుుకున్నాడు.

2016, 2017 ముంబయిలో జరిగిన భారత రైల్వే వెయిట్ లిఫ్టింగ్ జట్టు శిక్షణ శిబిరంలో.. ఫిజియోగా, మసాజర్ గా వ్యవహరించాడు. ఇండియన్ రైల్వేస్ జట్టు కోచ్, ప్రస్తుత భారత వెయిట్ లిఫ్టింగ్ జట్టు చీఫ్ కోచ్, ద్రోణాచార్య అవార్డీ విజయ శర్మ దృష్టిని ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో కోటేశ్వరరావును భారత వెయిట్ లిఫ్టింగ్ జట్టుకు మసాజర్ గా నియమిస్తూ.. ఇండియన్ రైల్వే స్పోర్ట్స్ బోర్డు నుంచి ఆదేశాలు అందాయి.

2018 కామన్ వెల్త్ గేమ్స్ లో పాల్గొనే భారత లిఫ్టర్లకు మసాజర్ గా నియమితులయ్యారు. ఆ సమయంలో ఎక్కువ పతకాలు గెలవడంతో.. అప్పటి నుంచి ఏ పోటీల్లో పాల్గొనాలన్నా.. కోటేశ్వరరావును వెంట తీసుకువెళ్లేవారు.

ప్రస్తుతం టోక్యో ఒలంపిక్స్ లో సైతం.. ఆయన లిఫ్టర్లకు అండగా, మసాజర్ గా వ్యవహరించారు. 2018లో మీరాబాయి ఛాను కామన్వెల్త్ గేమ్స్ లో పసిడి గెలుచుకుంది. అప్పటి నుంచి మీరా కోటేశ్వరరావును అన్నా అంటూ ఆప్యాయంగా పిలిచేదట. 

అప్పటి నుంచి.. కోటేశ్వరరావు.. మీరా విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించేవారు. ఆమెకు లిఫ్ట్స్ ఎత్తడంలో సహాయం చేయడంతోపాటు.. ఎత్తిన తర్వాత మసాజ్ చేయడం.. తీసుకునే ఆహారంలో పోషకాలు ఉండేలా చూడటం.. ఇలా అన్ని విధాలుగా సహకరిస్తూ వస్తున్నారు. 

click me!