Tokyo Olympics: ఆర్చరీ వ్యక్తిగత ర్యాంకింగ్స్ లో 9వ స్థానంలో నిలిచిన దీపికాకుమారి

Published : Jul 23, 2021, 08:05 AM IST
Tokyo Olympics: ఆర్చరీ వ్యక్తిగత ర్యాంకింగ్స్ లో 9వ స్థానంలో నిలిచిన దీపికాకుమారి

సారాంశం

భారత ఆర్చర్ దీపికా కుమారి వ్యక్తిగత ర్యాంకింగ్ రౌండ్ లో టాప్ టెన్ లో నిలిచింది. ఈ ఈవెంట్ తరువాత దీపిక భూటాన్ కి చెందిన 56వ సీడ్ కర్మను 64వ రౌండ్ లో ఎదుర్కోనుంది. 

కరోనా వైరస్ వల్ల వాయిదా పడ్డ ఒలింపిక్స్ నేటి నుండి ప్రారంభమయిన విషయం తెలిసిందే. నేటి సాయంత్రం భారత కాలమానం ప్రకారం 4.30కు ప్రారంభోత్సవ వేడుకతో ఆరంభమవనుంది. దానికన్నా ముందే నేడు ఉదయమే మహిళల ఆర్చరీ వ్యక్తిగత ర్యంకింగ్ రౌండ్ ప్రారంభమయింది. 

భారత ఆర్చర్ దీపికా కుమారి ఈ వ్యక్తిగత ర్యాంకింగ్ రౌండ్ లో టాప్ టెన్ లో నిలిచింది. ఈ ఈవెంట్ తరువాత దీపిక భూటాన్ కి చెందిన 56వ సీడ్ కర్మను 64వ రౌండ్ లో ఎదుర్కోనుంది. ఈ ఈవెంట్ ముగియడంతో పురుషుల ఆర్చరీ వ్యక్తిగత ర్యాంకింగ్ రౌండ్ ప్రారంభమవనుంది. 

Also Read: టోక్యో 2020: ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న భారత అథ్లెట్లు వీరే... ఏ ఆటలో ఎవరు బరిలో...

ఈ ఈవెంట్లో భారత్ తరుఫున దీపికా కుమారి భర్త అతాను దాస్ తో పాటు తరుణ్ దీప్ రాయ్,ప్రవీణ్ జాదవ్ లు కూడా పాల్గొననున్నారు. 33 క్రీడలకు చెందిన 339 ఈవెంట్లలో 11,000 పైచిలుకు మంది అథ్లెట్లు పోటీ పడుతున్నారు. భారత్ నుండి కనీవినీ ఎరుగని రీతిలో 127 మందితో కూడిన జంబో బృందం బయల్దేరి వెళ్ళింది. 

తొలి రౌండ్ లో దీపిక 56 పాంట్లు సాధించగా రెండవ రౌండ్లో 55 పాయింట్లు సాధించి 10వ స్థానంలో నిలిచింది. కానీ 4వ రౌండ్లో 51 పాయింట్లు మాత్రమే స్కోర్ చేయడంతో దీపిక 14వ స్థానానికి పడిపోయింది. కానీ వెంటనే తేరుకున్న వరల్డ్ నెంబర్ 1... తదుపరి 5వ రౌండ్ లో 59 పాయింట్లు సాధించింది. ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి దీపిక 4వ స్థానంలో నిలిచింది. 

సెకండ్ హాఫ్ లోని తొలి రౌండ్లో 55 పాయింట్లు సాధించిన దీపిక తదుపరి రౌండ్లో 53 పాయింట్లు మాత్రమే సాధించడం, ఇతర ఆర్చెర్లు మెరుగైన ప్రదర్శన చేయడం వల్ల దీపిక 8వ స్థానానికి పడిపోయింది. 

మూడవ రౌండ్లో 56 పాయింట్లు సాధించి మరొకసారి 7వ స్థానానికి ఎగబాకింది. నాలుగవ రౌండ్లో 58,5వ రౌండ్లో 53 పాయింట్లు సాధించిన దీపిక, 6వ రౌండ్లో 54 పాయింట్లు సాధించి మొత్తంగా 663 పాయింట్లు సాధించి 9వ స్థానంలో నిలిచింది. 

Also Read: టోక్యో ఒలింపిక్స్: విశ్వక్రీడల్లో మనమెక్కడ... ఈసారైనా ఆ లోటు తీరేనా...

కొరియన్ ఆర్చరీ దిగ్గజాలు ఆన్ సాన్,జాంగ్ , కాంగ లు తొలి మూడు స్థానాల్లో నిలవడం గమనార్హం. దీపికా తన 1/16వ ఎలిమినేషన్ రౌండ్లో భూటాన్ కి చెందిన కర్మ భూ తో తలపడనుంది. 

PREV
click me!

Recommended Stories

INDW vs SLW : స్మృతి మంధాన సరికొత్త చరిత్ర.. ప్రపంచ రికార్డు బద్దలు ! లంకపై భారత్ ఘన విజయం
IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !