ప్రారంభం కాకముందే ముగ్గురు అవుట్... టోక్యో ఒలింపిక్స్‌లో కరోనా బీభత్సం...

By Chinthakindhi Ramu  |  First Published Jul 22, 2021, 10:39 AM IST

ఒలింపిక్ విలేజ్‌కి 8కి పెరిగిన కరోనా కేసుల సంఖ్య...

విశ్వక్రీడలతో సంబంధం ఉన్న అధికారులు, సిబ్బందితో కలిసి 75 పాజిటివ్ కేసులు...

రేపు ఘనంగా ప్రారంభం కానున్న టోక్యో ఒలింపిక్స్ 2020...


టోక్యో ఒలింపిక్స్ ప్రారంభానికి ముందే కరోనా కలవరం మొదలైంది. ఒలింపిక్ స్పోర్ట్స్ విలేజ్‌లో ముగ్గురు ప్లేయర్లు, కరోనా పాజిటివ్‌గా తేలడంతో పోటీల నుంచి అర్ధాంతరంగా తప్పుకున్నారు.

చిలీ దేశానాకి చెందిన తైక్వాండో వుమెన్ ప్లేయర్ ఫెర్నాండో అగురే, నెదర్లాండ్‌కి చెందిన స్కేటింగ్ వుమెన్ ప్లేయర్ క్యాంటీ జాకబ్స్, చెక్ రిప్లబిక్‌కి చెందిన టీటీ ప్లేయర్ పావెల్ సిరుసెక్‌లకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. దీంతో పోటీల ఆరంభానికి ముందే వీరిపై అనర్హత వేటు పడింది.

Latest Videos

undefined

వీరిని ఐసోలేషన్‌కు తరలించిన అధికారులు, ఈ అథ్లెట్లతో ఉన్న అధికారులను, మిగిలిన అథ్లెట్లను క్వారంటైన్‌కి తరలించారు. ఈ ముగ్గురితో కలుపుకుని ఒలింపిక్ విలేజ్‌లో కరోనా సోకిన వారి సంఖ్య 8కి చేరుకుంది.

ఒలింపిక్ సంబంధిత ఎన్‌జీవోలు, ఆర్గనైజన్ అధికారులు ఇలా మరో 75 మంది కరనా బారిన పడ్డారు.

వీరితో పాటు కొందరు అథ్లెట్స్, తమ తమ దేశాల నుంచి బయలుదేరడానికి ముందే కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఒలింపిక్స్ నుంచి దూరమయ్యారు. ఇలా దూరమైనవారిలో బ్రిటన్ వుమెన్ షూటర్ అంబర్‌ హిల్ కూడా ఉంది.

click me!