టోక్యో ఒలింపిక్స్: హైదరాబాద్ చేరుకున్న పీవీ సింధు.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఘనస్వాగతం

By Siva KodatiFirst Published Aug 4, 2021, 2:28 PM IST
Highlights

టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు హైదరాబాద్ చేరుకున్నారు. బుధవారం ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న పీవీ సింధుకి తెలంగాణ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, సైబరాబాద్ సీపీ సజ్జనార్, అధికారులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. 
 

టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు హైదరాబాద్ చేరుకున్నారు. బుధవారం ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న పీవీ సింధుకి తెలంగాణ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, సైబరాబాద్ సీపీ సజ్జనార్, అధికారులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. 

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. పీవీ సింధు తన అద్భుత ప్రదర్శనతో భారతదేశానికి, తెలుగు రాష్ట్రాలకు మంచి పేరు తీసుకొచ్చారని ప్రశంసించారు. దేశం గర్వించే రీతిలో రెండు సార్లు ఒలింపిక్స్ మెడల్ సాధించారని కొనియాడారు. తెలంగాణ గడ్డపై పుట్టి రెండు రాష్ట్రాలకు గొప్ప పేరు తీసుకురావడంతో పాటు హైదరాబాద్‌లోనే బ్యాడ్మింటన్‌లో శిక్షణ తీసుకున్నారని మంత్రి తెలిపారు. పీవీ సింధు బరిలో నిలిచినప్పుడు ఖచ్చితంగా గోల్డ్ మెడల్ సాధించాలని దేశం మొత్తం కోరుకుందని ఆయన అన్నారు. 

ALso Read:ఒలింపిక్ ఛాంపియన్ పీవీ సింధుతో ఏషియా నెట్ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ

పులి ఒక అడుగు వెనక్కి వేసినా.. తర్వాత పది అడుగులు ముందుకేస్తుందన్నట్లు వచ్చే ఒలింపిక్స్‌లో వంద శాతం గోల్డ్ మెడల్ సాధించాలని శ్రీనివాస్ గౌడ్ ఆకాంక్షించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ క్రీడాకారులకు ప్రాధాన్యత ఇచ్చారని గుర్తుచేశారు. గతంలో రజత పతకం గెలిచినప్పుడు కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహం అందించిందన్నారు. కోవిడ్ సమయంలోనూ ఆమె బ్యాడ్మింటన్ ఆడేందుకు ప్రభుత్వం సహకరించిందని మంత్రి పేర్కొన్నారు. క్రీడలకు సంబంధించి పాలసీ రూపొందించేందుకు మంత్రి వర్గ ఉపసంఘాన్ని కూడా కేసీఆర్ నియమించారని .. ఇందులో క్రీడాకారులు, కోచ్‌లు, ఫిట్‌నెస్ ట్రైనీలకు సాయం చేస్తామన్నారు. పీవీ సింధు భవిష్యత్‌లో ఎన్నో విజయాలు సాధించాలని శ్రీనివాస్ గౌడ్ ఆకాంక్షించారు. 

అనంతరం పీవీ సింధు మాట్లాడుతూ.. ప్రభుత్వ సపోర్ట్‌తోనే తాను విజయం సాధించానని తెలిపారు. ఒలింపిక్స్‌కు వెళ్లేముందు కూడా గచ్చిబౌలి స్టేడియంలో ప్రాక్టీస్ చేసుకునేందుకు అనుమతి ఇచ్చారని పీవీ సింధు అన్నారు. సైబరాబాద్ సీపీ సజ్జనార్‌కు ఆమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. 

click me!