టోక్యో ఒలింపిక్స్: భారత్‌కు చేరుకున్న పీవీ సింధు.. ఢిల్లీలో ఎయిర్‌పోర్ట్‌లో ఘనస్వాగతం

By Siva KodatiFirst Published Aug 3, 2021, 3:33 PM IST
Highlights

టోక్యో ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శనతో కాంస్య పతకం గెలిచిన తెలుగు తేజం పీవీ సింధు తిరిగి భారతదేశానికి చేరుకున్నారు. మంగళవారం ఆమెకు ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.

టోక్యో ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శనతో కాంస్య పతకం గెలిచిన తెలుగు తేజం పీవీ సింధు తిరిగి భారతదేశానికి చేరుకున్నారు. మంగళవారం ఆమెకు ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ సహా కేంద్ర మంత్రులను సింధు కలవనున్నారు. 

Also Read:పీవీ సింధు గురించి ఈ నిజాలు మీకు తెలుసా..?

కాగా, టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కి ఎట్టకేలకు రెండో పతకం దక్కింది. భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పీవీ సింధు, కాంస్య పతక పోరులో విజయం సాధించింది. పీవీ సింధు గెలిచిన కాంస్యంతో, టోక్యో ఒలింపిక్స్‌లో భారత పతకాల సంఖ్య 2కి చేరింది. కాంస్యపతక పోరులో చైనాకి చెందిన హీ బింగ్ జివో‌తో జరిగిన మ్యాచ్‌లో 21-13, 21-15 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించిన పీవీ సింధు, భారత్‌కి పతకాన్ని అందించింది. అంతేకాకుండా వరుసగా రెండు ఒలింపిక్స్‌లలో పతకాలు సాధించిన ఏకైక క్రీడాకారిణీగా పీవీ సింధు రికార్డుల్లోకెక్కారు. 

click me!