మూడో రౌండ్‌లో ఆస్టియాకి చెందిన సోఫియా పాల్కనోవాతో జరిగిన మ్యాచ్‌లో 4-0 తేడాతో ఓడిన మానికా బత్రా...
మెన్స్ టీటీ ప్లేయర్ శరత్ కమల్ మాత్రమే పోటీలో....
టోక్యో ఒలింపిక్స్‌లో మూడో రౌండ్‌లోకి ప్రవేశించిన మొట్టమొదటి భారత టీటీ ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేసిన మానికా బత్రా... పోరాటం ముగిసింది. మూడో రౌండ్‌లో ఆస్టియాకి చెందిన సోఫియా పాల్కనోవాతో జరిగిన మ్యాచ్‌లో 4-0 తేడాతో ఓడి, టోర్నీ నుంచి నిష్కమించింది మానికా...
10వ సీడ్ సోఫియా జోరు ముందు నిలవలేకపోయిన మానికా 8-11, 2-11, 5-11, 7-11 తేడాతో వరుస సెట్లను అప్పగించేసింది. రెండో రౌండ్‌లో సుత్రీతా ముఖర్జీ కూడా ఓడడంతో మూడో రౌండ్‌కి అర్హత సాధించిన మెన్స్ టీటీ ప్లేయర్ శరత్ కమల్ మాత్రమే పోటీలో నిలిచాడు.
undefined
టోక్యో ఒలింపిక్స్‌లో మూడో రోజు భారత జట్టుకి పెద్దగా కలిసి రాలేదు. భారత ఆర్చరీ టీమ్ క్వార్టర్ ఫైనల్స్‌లో ఓడగా, టీటీ ప్లేయర్ సుత్రీత, బ్యాడింటన్ డబుల్స్ ప్లేయర్లు సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి, ఫెన్సర్ భవానీ దేవీ రెండో రౌండ్‌లో ఓడారు.
భారత షూటర్లు అంగడ్ భజ్వా, మైరాజ్ ఖాన్ స్కీట్ ఈవెంట్‌లో 18, 25వ స్థానంలో నిలిచి ఘోరంగా విఫలమయ్యారు. టేబుల్ టెన్నిస్ మెన్స్ సింగిల్స్‌లో శరత్ కమల్ మాత్రం రెండో రౌండ్‌లో గెలిచి, మూడో రౌండ్‌కి అర్హత సాధించడం ఒక్కటే భారత జట్టుకి దక్కిన విజయం.