టోక్యో ఒలింపిక్స్: సెమీస్‌లో ఓడిన దీపక్ పూనియా... కాంస్యపతక పోరుకి...

Published : Aug 04, 2021, 03:38 PM IST
టోక్యో ఒలింపిక్స్: సెమీస్‌లో ఓడిన దీపక్ పూనియా... కాంస్యపతక పోరుకి...

సారాంశం

యూఎస్‌ఏకి చెందిన డేవిడ్ టేలర్‌తో జరిగిన మ్యాచ్‌లో 0-10 తేడాతో పోరాడి ఓడిన భారత రెజ్లర్ దీపక్ పూనియా...  

86 కేజీల ఫ్రీస్టైయిల్ సెమీ ఫైనల్‌లో యూఎస్‌ఏకి చెందిన డేవిడ్ టేలర్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత రెజ్లర్ దీపక్ పూనియా 0-10 తేడాతో పోరాడి ఓడాడు. మాజీ వరల్డ్ ఛాంపియన్‌ డేవిడ్ టేలర్ జోరు ముందు నిలవలేకపోయిన పోయిన దీపక్ పూనియా, ఏ మాత్రం పోరాటం చూపించలేకపోయాడు...

సెమీస్‌లో ఓడినా కాంస్య పతకం కోసం జరిగే మ్యాచ్‌లో ఆడబోతున్నాడు దీపక్ పూనియా.. అంతకుముందు టోక్యో ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ రవికుమార్ దహియా అద్భుత పోరాటంతో ఫైనల్‌కి అర్హత సాధించాడు.
 

సెమీ ఫైనల్‌లో కజికిస్తాన్‌కి చెందిన నురిస్లామ్ సనయెవ్‌తో జరిగిన మ్యాచ్‌లో  తొలి పీరియడ్‌లో 2-1 తేడాతో ఆధిక్యంలో కనిపించాడు రవికుమార్ దహియా, అయితే బ్రేక్ తర్వాత ఎదురుదాడి చేసిన సనయెవ్ ఒకేసారి 8 పాయింట్లు సాధించి 2-9 తేడాతో తిరుగులేని ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. 

ఆ తర్వాత వరుస మూడు, రెండు పాయింట్ల సాధించి 7-9 తేడాతో ఆధిక్యాన్ని తగ్గించాడు రవికుమార్ దహియా.. ఆ తర్వాత రెండు పాయింట్లు సాధించి ఫైనల్‌కి దూసుకెళ్లాడు రవికుమార్ దహియా...

PREV
click me!

Recommended Stories

INDW vs SLW : స్మృతి మంధాన సరికొత్త చరిత్ర.. ప్రపంచ రికార్డు బద్దలు ! లంకపై భారత్ ఘన విజయం
IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !