టోక్యో ఒలింపిక్స్: ఫైనల్‌కి రవికుమార్ దహియా... రెజ్లింగ్‌లో మరో పతకం ఖాయం...

By Chinthakindhi Ramu  |  First Published Aug 4, 2021, 3:00 PM IST

 సెమీ ఫైనల్‌లో 2-9 తేడాతో వెనకబడి, అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చిన రవికుమార్ దహియా...


టోక్యో ఒలింపిక్స్‌లో సెమీస్ చేరిన భారత రెజ్లర్ రవికుమార్ దహియా అద్భుత పోరాటంతో ఫైనల్‌కి అర్హత సాధించాడు.  సెమీ ఫైనల్‌లో కజికిస్తాన్‌కి చెందిన నురిస్లామ్ సనయెవ్‌తో జరిగిన మ్యాచ్‌లో  తొలి పీరియడ్‌లో 2-1 తేడాతో ఆధిక్యంలో కనిపించాడు రవికుమార్ దహియా.

అయితే బ్రేక్ తర్వాత ఎదురుదాడి చేసిన సనయెవ్ ఒకేసారి 8 పాయింట్లు సాధించి 2-9 తేడాతో తిరుగులేని ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. ఆ తర్వాత వరుస మూడు, రెండు పాయింట్ల సాధించి 7-9 తేడాతో ఆధిక్యాన్ని తగ్గించాడు రవికుమార్ దహియా.. ఆ తర్వాత రెండు పాయింట్లు సాధించి ఫైనల్‌కి దూసుకెళ్లాడు రవికుమార్ దహియా...

Latest Videos

ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన మొట్టమొదటి భారత అథ్లెట్ సుశీల్ కుమార్ తర్వాత ఫైనల్‌కి అర్హత సాధించిన భారత రెజ్లర్‌గా చరిత్ర క్రియేట్ చేశాడు రవికుమార్ దహియా...

click me!