టోక్యో ఒలింపిక్స్: క్వార్టర్ ఫైనల్ చేరిన భారత మిక్స్‌డ్ ఆర్చరీ టీమ్...

Published : Jul 24, 2021, 09:24 AM IST
టోక్యో ఒలింపిక్స్: క్వార్టర్ ఫైనల్ చేరిన భారత మిక్స్‌డ్ ఆర్చరీ టీమ్...

సారాంశం

మిక్స్‌డ్ ఆర్చరీ టీమ్ ఈవెంట్‌లో క్వార్టర్ ఫైనల్‌కి భారత నెం.1 ఆర్చర్ దీపికా కుమారి, ప్రవీణ్ జాదవ్... టేబుల్ టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్‌లో తొలి రౌండ్‌లోనే ఓడిన శరత్ కమల్, మానికా బత్రా...  

టోక్యో ఒలింపిక్స్‌లో భారత ఆర్చరీ జట్టుకి ఎట్టకేలకు ఓ శుభారంభం లభించింది. మిక్స్‌డ్ ఆర్చరీ టీమ్ ఈవెంట్‌లో భారత నెం.1 ఆర్చర్ దీపికా కుమారి, ప్రవీణ్ జాదవ్ క్వార్టర్‌ ఫైనల్‌కి దూసుకెళ్లారు. ఉదయం 11.04 నిమిషలకు క్వార్టర్ ఫైనల్ ఈవెంట్ జరగనుంది.

గ్రూప్ ఓపెనింగ్ మ్యాచ్‌లో హాకీ జట్టు, న్యూజిలాండ్‌పై 3-2 తేడాతో విజయం సాధించగా టేబుల్ టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత జట్టు తరుపున బరిలో దిగిన మానీకా బత్రా, శరత్ కమల్ తొలి రౌండ్‌లోనే ఓడి, పోటీ నుంచి నిష్కమించారు.

వరల్డ్ నెం.1 టీటీ జోడి చైనాకు చెందిన లిన్ యున్ జూ, చెంగ్ ఐ చింగ్‌‌తో జరిగిన మ్యాచ్‌లో 4-0 తేడాతో ఓడింది భారత జట్టు. వుమెన్స్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్‌లో భారత షూటర్లు ఎలవెనిల్ 16 ర్యాంకులో, అపూర్వి చండేలా 36వ ర్యాంకులో ముగించారు.

PREV
click me!

Recommended Stories

INDW vs SLW : స్మృతి మంధాన సరికొత్త చరిత్ర.. ప్రపంచ రికార్డు బద్దలు ! లంకపై భారత్ ఘన విజయం
IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !