Tokyo 2020: మహిళల షూటింగ్ లో భారత్ కు నిరాశ... ఆర్చరీ మిక్స్డ్ టీంలో క్వార్టర్స్ లోకి ఎంట్రీ

By team teluguFirst Published Jul 24, 2021, 8:02 AM IST
Highlights

ఒలింపిక్స్ తొలి రోజు ఆటలో భారత మహిళా షూటర్లు నిరాశపర్చగా... మిక్స్డ్ టీం ఆర్చరీలో క్వార్టర్స్ బెర్త్ ను దీపికాకుమారి, ప్రవీణ్ జాదవ్ లు దక్కించుకున్నారు. 

టోక్యో ఒలింపిక్స్ లో భారత్ అత్యధిక ఆశలు పెట్టుకున్న ఈవెంట్ షూటింగ్. ఇందులో గత కొంత కాలంగా భారత్ మెడల్స్ సాధించడంతోపాటుగా... ఈసారి ఈవెంట్ కి వెళ్లిన ఆటగాళ్లలో వరల్డ్ నెంబర్1 ప్లేయర్స్,రికార్డు హోల్డర్స్ ఉన్నారు. కానీ భారత మహిళా షూటర్లు ఫైనల్స్ కి క్వాలిఫై కాలేకపోయి... అభిమానులను నిరాశలో ముంచెత్తారు. 

భారత 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ లో భారత్ నుండి హేమాహేమీలు క్వాలిఫై అయ్యారు. ఉన్న ఇద్దరిలో కూడా అపూర్వీ చండేలా తన రైఫిల్ కిట్ ని హ్యాండిల్ చేయడంలో ఇబ్బంది పడగా.... ఎలావెనిల్ కరోనా మహమ్మారి వల్ల ఒలింపిక్స్ కి వచ్చిన బ్రేక్ కారణంగా మొమెంటుమ్ ని కోల్పోయినట్టుగా కనబడింది. 

కేవలం భరత్ నుండే కాదు మిగిలిన దేశాల నుండి కూడా టాప్ ప్లేయర్ల పెర్ఫార్మన్స్ పై కరోనా దెబ్బ స్పష్టంగా కనబడింది. టాప్ 8 లో నిలిచినా ప్లేయర్స్ లో కేవలం ఇద్దరికి మాత్రమే వరల్డ్ కప్ మెడల్ రికార్డు ఉందంటే... కొత్త షూటర్లు ఎలా ఈ స్పేస్ ని డామినెటే చేసారో మనం అర్థం చేసుకోవచ్చు. 

ఇక ఆర్చరీ మిక్స్డ్ టీమ్ ఈవెంట్ లో భారత ఆర్చర్లు దీపికాకుమారి, ప్రవీణ్ జాదవ్ లు క్వార్టర్ ఫైనల్స్ లోకి దూసుకెళ్లారు. ఫస్ట్ సెట్ ని ఒక పాయింట్ తో కోల్పోయి, రెండవ సెట్ ను టై చేసుకొని 1-3 తో వెనుకంజలో ఉన్న భారత ఆర్చర్లు... అనూహ్యంగా పుంజుకొని తైపే జోడీని మట్టికరిపించి క్వార్టర్ ఫైనల్స్ లోకి దూసుకెళ్లారు. 

మరికొద్ది సేపట్లో ఉదయం 11 తరువాత జరగనున్న మహిళల ఆర్చరీ మిక్స్డ్ ఈవెంట్ లో క్వార్టర్స్ లో బాంగ్లాదేశ్, కొరియా ఆర్చర్లతో తలపడనుంది. ఇక ఉదయం 9.30కు షూటింగ్ మేన్స్ విభాగంలో భారత మెడల్ హోప్... అతి పిన్న వయస్కుడు సౌరభ్ తివారీ తలపడనున్నాడు. 

నేడు ఈ ఆటలతోపాటుగా హాకీ,జూడో,వెయిట్ లిఫ్టింగ్,బ్యాడ్మింటన్, రోయింగ్ లలో భారత అథ్లెట్లు పోటీపడనున్నారు. వెయిట్ లిఫ్టింగ్ లో భారత్ తరుపున పోటీ పడుతున్న ఏకైక అథ్లెట్... భారత్ కు పతకం సాధించి పెడుతుందని భారత దేశం ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్న మీరాబాయి చాను మరికాసేపట్లో తలపడనుంది. 

click me!