ఒలింపిక్స్‌లో కరోనా కలకలం.. ఐసోలేషన్‌లో 63 మంది ఆస్ట్రేలియా అథ్లెట్లు...

By Chinthakindhi Ramu  |  First Published Jul 29, 2021, 1:34 PM IST

యూఎస్ పోల్ వాల్టర్ సామ్ కెండ్రిక్స్‌కి కరోనా పాజిటివ్... ఆస్ట్రేలియా ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ల టీమ్ మొత్తం ఐసోలేషన్‌‌లో...

ఒలింపిక్స్ జరుగుతున్న టోక్యోలో గురువారం 3,865 కొత్త కరోనా కేసులు....


టోక్యో విశ్వక్రీడలపై కరోనా వైరస్ పంజా విసిరింది. ఇప్పటికే ఒలింపిక్ విలేజ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 193కి చేరగా, వైరస్ బారిన పడిన అథ్లెట్ల సంఖ్య కూడా రోజురోజుకీ పెరుగుతోంది. యూఎస్ పోల్ వాల్టర్ సామ్ కెండ్రిక్స్‌కి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆస్ట్రేలియా ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ల టీమ్ మొత్తం ఐసోలేషన్‌కి వెళ్లింది. 

రెండుసార్లు వరల్డ్ ఛాంపియన్‌ అయిన కెండ్రిక్స్‌, కరోనా బారిన పడడంలో టోక్యో ఒలింపిక్స్ నుంచి తప్పుకున్నాడు. అయితే అతనితో కాంటాక్ట్ ఉన్న ఆస్ట్రేలియా అథ్లెట్ల టీమ్ మొత్తం ఐసోలేషన్‌కి వెళ్లాల్సి వచ్చింది. వీరందరికీ కరోనా పరీక్షలు నిర్వహించిన తర్వాతే విశ్వక్రీడల్లో పాల్గొంటారా? లేదా? అనే విషయంపై క్లారిటీ వస్తుంది. 

Latest Videos

undefined

 అలాగే ఒలింపిక్‌లో గోల్ఫ్ టోర్నీపై కూడా కరోనా ప్రభావం పడింది. కసుమిసజెకి కౌంటీ క్లబ్‌లో ఓ ప్లేయర్ కరోనా బారిన పడడంతో టాప్ ప్లేయర్లు, ఒలింపిక్స్‌కి దూరంగా ఉన్నారు.  ఒలింపిక్స్ జరుగుతున్న టోక్యోలో గురువారం 3,865 కొత్త కరోనా కేసులు వెలుగుచూశాయి. టోక్యోలో ఇదే అత్యధికం. 

ఒలింపిక్స్‌లో కరోనా కేసులు పెరుగుతుండడంతో అథ్లెట్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. జూలై 23న మొదలైన విశ్వక్రీడలు, ఆగస్టు 8 వరకూ జరగనున్నాయి. అయితే ఈ రేంజ్‌లో కేసులు పెరుగుతూ పోతే, విశ్వక్రీడలను అర్ధాంతరంగా నిలిపివేసే అవకాశమూ ఉంది.

click me!