టోక్యో ఒలింపిక్స్: పోరాడి ఓడిన సతీశ్ కుమార్... వరల్డ్ ఛాంపియన్‌తో పోరులో...

Published : Aug 01, 2021, 10:11 AM IST
టోక్యో ఒలింపిక్స్: పోరాడి ఓడిన సతీశ్ కుమార్... వరల్డ్ ఛాంపియన్‌తో పోరులో...

సారాంశం

క్వార్టర్ ఫైనల్స్‌లో వరల్డ్ ఛాంపియన్‌ బకోడిర్ జలోలోవ్‌తో జరిగిన మ్యాచ్‌లో 0-5 తేడాతో పోరాడి ఓడిన సతీశ్ కుమార్... సతీశ్ కుమార్ ఓటమితో టోక్యో ఒలింపిక్స్‌లో భారత మెన్స్ బాక్సర్ల పోరాటం... భారత మెన్స్ బాక్సర్లకు టోక్యో ఒలింపిక్స్‌లో దక్కిన ఒకే ఒక్క విజయం సతీశ్ కుమార్‌దే...

టోక్యో ఒలింపిక్స్‌లో క్వార్టర్స్ చేరిన ఏకైక భారత మేల్ బాక్సర్ సతీశ్ కుమార్ పోరాటం ముగిసింది. హెవీ వెయిట్ బాక్సింగ్ కేటగిరి క్వార్టర్ ఫైనల్స్‌లో వరల్డ్ ఛాంపియన్‌ బకోడిర్ జలోలోవ్‌తో జరిగిన మ్యాచ్‌లో 0-5 తేడాతో పోరాడి ఓడాడు సతీశ్ కుమార్...

తొలి రౌండ్‌లో జమైకా బాక్సర్‌తో జరిగిన మ్యాచ్‌‌లో తీవ్రంగా గాయపడిన సతీశ్ కుమార్, మెడికల్ క్లియరెన్స్ రావడంతో క్వార్టర్స్ బరిలో నిలిచాడు. అయితే వరల్డ్ ఛాంపియన్‌ అయిన ఉజెకిస్తాన్ బాక్సర్ ముందు సతీశ్ నిలవలేకపోయాడు. 

సతీశ్ కుమార్ ఓటమితో టోక్యో ఒలింపిక్స్‌లో భారత మెన్స్ బాక్సర్ల పోరాటం ముగిసింది. మనీశ్ కౌషిక్, వికాస్ కృష్ణన్, ఆశీష్ కుమార్ తొలి రౌండ్‌లోనే ఓడిపోగా, మొదటి రౌండ్‌లో బై దక్కడంతో రెండో రౌండ్‌కి వచ్చిన భారత స్టార్ బాక్సర్ అమిత్ పంగల్, మొదటి ఫైట్‌లోనే ఓటమి పాలయ్యాడు. మొత్తంగా భారత మెన్స్ బాక్సర్లకు టోక్యో ఒలింపిక్స్‌లో దక్కిన ఒకే ఒక్క విజయం సతీశ్ కుమార్‌దే.

PREV
click me!

Recommended Stories

Virat Kohli : సచిన్, పాంటింగ్ లకు షాకిచ్చిన విరాట్ కోహ్లీ.. సూపర్ రికార్డు !
Shreyas Iyer : 10 ఫోర్లు, 3 సిక్సర్లతో మెరుపులు.. అయ్యర్ వస్తే అదిరిపోవాల్సేందే మరి !