ఈమె ఆస్ట్రేలియా ‘జలకన్య’... ఒకే ఒలింపిక్స్‌లో ఏడు మెడల్స్... 69 ఏళ్ల రికార్డు బ్రేక్ చేసిన స్విమ్మర్...

By Chinthakindhi Ramu  |  First Published Aug 1, 2021, 9:59 AM IST

నాలుగు ఈవెంట్లలో ఒలింపిక్ రికార్డులు క్రియేట్ చేసిన ఎమ్మా మెక్‌కియాన్... స్విమ్మింగ్‌లో మొత్తంగా ఏడు పతకాలు...

 మొత్తంగా 11 ఒలింపిక్ పతకాలు...  ఆస్ట్రేలియా తరుపున మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఒలింపియన్‌గా చరిత్ర...


భారత్‌ నుంచి 120 మందికి పైగా అథ్లెట్లు వెళ్లి, ఒక్క సిల్వర్ మెడల్ తెచ్చినందుకు తెగ మురిసిపోతుంటే... ఆస్ట్రేలియా స్విమ్మర్ ఎమ్మా మెక్‌కియాన్... ఒకే ఒలింపిక్స్‌లో ఏడు పతకాలు కొల్లగొట్టింది. మొత్తంగా ఆమె ఒలింపిక్ మెడల్స్ సంఖ్య 11... 

హీట్స్‌లో 24.02 సెక్లన్లలో ముగించి ఒలింపిక్ రికార్డు బద్ధలు కొట్టిన ఎమ్మా, సెమీ పైనల్‌లో 24.0, ఫైనల్‌లో మరింత వేగంగా 23.81 సెకన్లలో ముగించి చరిత్ర క్రియేట్ చేసింది. త్రీ 50 మీటర్ల ఫ్రీ స్టైయిల్ ఈవెంట్, 4x100 మిడ్‌లే రిలేలో రికార్డులు క్రియేట్ చేసిన ఎమ్మా మెక్‌కియాన్... స్విమ్మింగ్‌లో మొత్తంగా ఏడు పతకాలు సాధించింది.

Latest Videos

ఇందులో నాలుగు స్వర్ణాలు, మూడు కాంస్య పతకాలు ఉన్నాయి.1952లో సోవియట్ జిమ్మాస్ట్ మరియా గోరోకోవిస్కయ రికార్డును సమం చేసిన ఎమ్మా, స్విమ్మింగ్ లెజెండ్ ఇయాన్ తోర్ప్ రికార్డును అధిగమించి... ఆస్ట్రేలియా తరుపున మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఒలింపియన్‌గా చరిత్ర సృష్టించింది. 

ఒకే ఒలింపిక్‌లో అత్యధిక పతకాలు సాధించిన మహిళా స్విమ్మర్‌గా నిలిచిన ఎమ్మా, మొత్తంగా 11 ఒలింపిక్ పతకాలు సాధించి, ఆస్ట్రేలియా తరుపున అత్యధిక పతకాలు సాధించిన అథ్లెట్‌గా నిలిచింది. 

click me!