టోక్యో ఒలింపిక్స్: తొలి రౌండ్‌లో ఆర్చర్ దీపికా కుమారి విజయం...

Published : Jul 28, 2021, 02:31 PM IST
టోక్యో ఒలింపిక్స్: తొలి రౌండ్‌లో ఆర్చర్ దీపికా కుమారి విజయం...

సారాంశం

 భూటాన్‌కి చెందిన కర్మాతో జరిగిన మ్యాచ్‌లో వరుస సెట్లలో సునాయాస విజయం సాధించిన దీపికా కుమారి... మెన్స్ సింగిల్స్‌లో ముగిసిన భారత ఆర్చర్ ప్రవీణ్ జాదవ్, తరుణ్‌దీప్ రాయ్ పోరాటం...

టోక్యో ఒలింపిక్స్ 2020లో వరల్డ్ నెం.1 ఆర్చర్ దీపికా కుమారి, మహిళల సింగిల్స్ ఈవెంట్‌లో తొలి రౌండ్‌లో సునాయాస విజయాన్ని అందుకుంది. భూటాన్‌కి చెందిన కర్మాతో జరిగిన మ్యాచ్‌లో వరుసగా మూడు సెట్లలో సునాయాస విజయం సాధించిన దీపికా కుమారి, రౌండ్ 16కి అర్హత సాధించింది.

అంతకుముందు మెన్స్ సింగిల్స్ ఈవెంట్‌లో భారత ఆర్చర్ ప్రవీణ్ జాదవ్, తరుణ్‌దీప్ రాయ్ రౌండ్ 16లో ఓడిపోయారు. మొదటి రౌండ్‌లో వరల్డ్ నెం.2 గల్సన్ బజర్‌జాపోయ్‌ను 6-0 తేడాతో ఓడించిన ప్రవీణ్ జాదవ్, అమెరికాకు చెందిన వరల్డ్ నెం.1 బ్రాడీ ఎల్లిసన్‌తో జరిగిన మ్యాచ్‌లో 0-6 తేడాతో ఓడిపోయాడు.

మొదటి మ్యాచ్‌లో ఉక్రెయిన్ ప్లేయర్ హన్‌బిన్‌ను ఓడించిన తరుణ్‌దీప్ రాయ్, ఆ తర్వాత ఇజ్రాయిల్‌కి చెందిన షాన్నీ ఇట్టీతో జరిగిన మ్యాచ్‌లో 6-5 తేడాతో ఓడాడు.

బుధవారం భారత మహిళా హాకీ జట్టు, గ్రేట్ బ్రిటన్ చేతుల్లో ఓడగా... పీవీ సింధు రెండో రౌండ్‌లో సునాయాస విజయాన్ని అందుకుంది. రోయింగ్‌ సెమీస్‌లో ఓడిన భారత ప్లేయర్లు అర్జున్ లాల్, అర్వింద్ సింగ్, ఇంటిదారి పట్టారు.

PREV
click me!

Recommended Stories

INDW vs SLW : స్మృతి మంధాన సరికొత్త చరిత్ర.. ప్రపంచ రికార్డు బద్దలు ! లంకపై భారత్ ఘన విజయం
IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !