టోక్యో ఒలంపిక్స్.. ఓడిపోతాననే భయంతో చెవి కొరికి..!

Published : Jul 28, 2021, 12:16 PM ISTUpdated : Jul 28, 2021, 01:24 PM IST
టోక్యో ఒలంపిక్స్.. ఓడిపోతాననే భయంతో చెవి కొరికి..!

సారాంశం

మ్యాచ్‌లో ఓడిపోతున్నాననే అసహనంతో మొరాకొకు చెందిన బాక్సర్‌ యూనెస్‌ బాల్లా.. న్యూజిలాండ్‌ బాక్సర్‌ డేవిడ్‌ న్యీకా చెవి కొరికాడు.  

టోక్యో ఒలంపిక్స్ ఉత్సాహంగా జరుగుతున్నాయి. కొందరు ఫైనల్స్ వరకు  చేరుకొని.. దేశానికి పతకం తెస్తుంటే.. కొందరు తొలి రౌండ్ లోనే వెనుదిరుగుతున్నారు. కాగా.. తాజాగా.. ఈ ఒలంపిక్స్ లో భాగంగా తలపడిన ఓ క్రీడాకారుడు చేసిన పని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆటలో ఓడిపోతాననే భయంతో ప్రత్యర్థి చెవి కొరికేశాడు. మ్యాచ్‌లో ఓడిపోతున్నాననే అసహనంతో మొరాకొకు చెందిన బాక్సర్‌ యూనెస్‌ బాల్లా.. న్యూజిలాండ్‌ బాక్సర్‌ డేవిడ్‌ న్యీకా చెవి కొరికాడు.

పూర్తి మ్యాటర్ లోకి వెళితే.. మంగళవారం బాక్సింగ్‌లో హెవీ వెయిట్‌ విభాగంలో మొరాకొకు చెందిన బాక్సర్‌ యూనెస్‌, న్యూజిలాండ్‌కు చెందిన డేవిడ్‌ నికా మధ్య పోరు జరిగింది. బౌట్‌లో డేవిడ్‌ నికా తొలి నుంచి ఆధిపత్యం ప్రదర్శించగా.. యూనెస్‌ తేలిపోయాడు. దీంతో అసహనానికి గురైన యూనెస్‌.. మూడో రౌండ్‌లో డేవిడ్‌ చెవి కొరకడానికి యత్నించాడు. యూనీస్‌ దంతాలు తగలగానే డేవిడ్‌ అతడిని దూరంగా నెట్టేశాడు. ఈ మ్యాచ్‌లో డేవిడ్‌ 5-0 తేడాతో యూనీస్‌ను ఓడించాడు. కాగా, యూనెస్‌ అనుచిత ప్రవర్తనతో ఇంటర్నేషనల్‌ బాక్సింగ్‌ అసోసియేషన్‌ అతడిని అనర్హుడిగా ప్రకటించింది. దీనికి సంబంధించిన వీడియో ట్విటర్‌లో షేర్‌ చేయగా ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. 
 

PREV
click me!

Recommended Stories

INDW vs SLW : స్మృతి మంధాన సరికొత్త చరిత్ర.. ప్రపంచ రికార్డు బద్దలు ! లంకపై భారత్ ఘన విజయం
IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !