అమెరికాకు చెందిన వరల్డ్ నెం.1 బ్రాడీ ఎల్లిసన్‌తో జరిగిన మ్యాచ్‌లో 0-6 తేడాతో ఓడిన ప్రవీణ్ జాదవ్...
వుమెన్స్ సింగిల్స్ పోటీలో నిలిచిన దీపికా కుమారి...
టోక్యో ఒలింపిక్స్‌లో భారత ఆర్చర్ల ఫెయిల్యూర్ కొనసాగుతూనే ఉంది. మెన్స్ సింగిల్స్ ఈవెంట్‌లో భారత ఆర్చర్ ప్రవీణ్ జాదవ్, రౌండ్ 16లో ఓడిపోయాడు. మొదటి రౌండ్‌లో వరల్డ్ నెం.2 గల్సన్ బజర్‌జాపోయ్‌ను 6-0 తేడాతో ఓడించిన ప్రవీణ్ జాదవ్, అమెరికాకు చెందిన వరల్డ్ నెం.1 బ్రాడీ ఎల్లిసన్‌తో జరిగిన మ్యాచ్‌లో 0-6 తేడాతో ఓడిపోయాడు.
మొదటి సెట్‌లో ప్రవీణ్ జాదవ్ 27 పాయింట్లు స్కోరు చేయగా, బ్రాడీ 28 పాయింట్లు స్కోరు చేశారు. రెండో సెట్‌లో బ్రాడీ ఎల్లిసన్ మొదటి షాట్‌కి 8 పాయింట్లు మాత్రమే స్కోరు చేయడంతో ప్రవీణ్‌కి మంచి అవకాశం లభించింది. అయితే ఆఖరి షాట్‌కి కేవలం 7 పాయింట్లు మాత్రమే స్కోరు చేసిన ప్రవీణ్, బ్రాడీ ఎల్లీసన్‌కి సెట్‌ను అప్పగించేశాడు.
undefined
మూడో సెట్‌లో తీవ్రమైన ఒత్తిడికి గురైన ప్రవీణ్ జాదవ్, 8, 8, 7 పాయింట్లు మాత్రమే సాధించాడు. బ్రాడీ ఎల్లీసన్ 26 పాయింట్లు స్కోరు చేసి మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. ఈ ఓటమితో ప్రవీణ్ జాదవ్, టోక్యో ఒలింపిక్స్ నుంచి నిరాశగా వెనుదిరుగుతుండగా, నేడు వుమెన్స్ సింగిల్స్‌లో దీపికా కుమారి మాత్రం పోటీలో నిలిచింది.
అంతకుముందు ఆర్చర్ తరుణ్‌దీప్ రాయ్ కూడా రౌండ్ 16లో ఓటమి చెంది, వెనుదిరాగాడు. మొదటి మ్యాచ్‌లో ఉక్రెయిన్ ప్లేయర్ హన్‌బిన్‌ను ఓడించిన తరుణ్‌దీప్ రాయ్, ఆ తర్వాత ఇజ్రాయిల్‌కి చెందిన షాన్నీ ఇట్టీతో జరిగిన మ్యాచ్‌లో 6-5 తేడాతో ఓడాడు.