
టోక్యో ఒలింపిక్స్ 2020లో మూడో రోజు భారత జట్టుకి పెద్దగా కలిసి రావడం లేనట్టే ఉంది. టేబుల్ టెన్నిస్ మెన్స్ సింగిల్స్‌లో సాథియన్ జ్ఞానశేఖరన్, హంగ్‌కాంగ్‌కి చెందిన లామ్ సి హంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో పోరాడి ఓడాడు.
గంటకు పైగా సాగిన ఈ సుదీర్ఘ మ్యాచ్‌లో 11-7, 7-11, 4-11, 5-11, 11-9, 12-10, 11-6 తేడాతో ఏడు సెట్ల వరకూ సాగిన మ్యాచ్‌లో జ్ఞానశేఖరన్, లామ్ సి హంగ్ చేతుల్లో 4-3 తేడాతో ఓడాడు.
తొలి గేమ్‌ను కోల్పోయినా, ఆ తర్వాత వరుసగా మూడు సెట్లు గెలిచి 3-1 తేడాతో తిరుగులేని ఆధిక్యం సంపాదించిన భారత టీటీ ప్లేయర్ జ్ఞానశేఖరన్, ఆ తర్వాత వరుసగా మూడు సెట్లు కోల్పోయి మ్యాచ్‌ను కోల్పోవడం విశేషం.
నిన్న జరిగిన టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో భారత టీటీ ప్లేయర్లు మానికా బత్రా, సుత్రీతా ముఖర్జీ విజయాలు అందుకుని, రెండో రౌండ్‌కి దూసుకెళ్లిన విషయం తెలిసిందే. రెండో రౌండ్‌లో మానికా, ఉక్రెయిన్‌కి చెందిన మార్గెట్టా పెసోకాతో తలబడనుంది.