టోక్యో ఒలింపిక్స్: తీవ్రంగా నిరాశపరిచిన మెన్స్ షూటర్లు...

Published : Jul 25, 2021, 11:12 AM IST
టోక్యో ఒలింపిక్స్: తీవ్రంగా నిరాశపరిచిన మెన్స్ షూటర్లు...

సారాంశం

10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో దీపక్ కుమార్‌కి 26వ ర్యాంకు... 32వ ర్యాంకు సాధించిన దివ్యాంశ్ పన్వార్ సింగ్... 

టోక్యో ఒలింపిక్స్‌లో భారతషూటర్ల ఫెయిల్యూర్ కొనసాగుతూనే ఉంది. మెన్స్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో పోటీపడిన భారత షూటర్లు దీపక్, దివ్యాంశ్ ఘోరంగా ఫెయిల్ అయ్యారు. దీపక్ 624.7 పాయింట్లతో 26వ స్థానంలో నిలవగా, దివ్యాంశ్ 622.8 పాయింట్లతో 32వ స్థానంలో నిలిచాడు.

మొత్తం 47 మంది పాల్గొన్న క్వాలిఫికేషన్ రౌండ్‌లో నుంచి 8 మంది మాత్రమే ఫైనల్‌కి అర్హత సాధిస్తారు. ఇప్పటిదాకా ఒలింపిక్స్‌లో భారత షూటర్లు 8 మంది పాల్గొనగా,ఒక్క సౌరభ్ చౌదరి మాత్రమే ఫైనల్స్‌కి అర్హత సాధించాడు.

10 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో మను బకర్, యశస్వినీ, 10 మీటర్ల పిస్టల్ విభాగంలో సౌరభ్ చౌదరి, అభిషేక్, 10 రైఫిల్ వుమెన్స్ విభాగంలో అపూర్వీ చండేలా, ఎలవెనిల్, 10 మీటర్ల రైఫిల్ విభాగంలో దివ్యాంశ్, దీపక్ పోటీల్లో పాల్గొన్న ఆశించిన స్థాయిలో పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయారు. సౌరభ్ చౌదరి ఫైనల్‌కి అర్హత సాధించినప్పటికీ 7వ స్థానంలో నిరాశపరిచాడు.

 

PREV
click me!

Recommended Stories

INDW vs SLW : స్మృతి మంధాన సరికొత్త చరిత్ర.. ప్రపంచ రికార్డు బద్దలు ! లంకపై భారత్ ఘన విజయం
IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !