టోక్యో ఒలింపిక్స్: 13 ఏళ్ల వయసులో ఒలింపిక్ స్వర్ణం గెలిచేసింది...

By Chinthakindhi Ramu  |  First Published Jul 26, 2021, 11:23 AM IST

 13 ఏళ్ల 330 రోజుల వయసులో స్వర్ణం సాధించిన జపాన్‌కి చెందిన మోమిజీ నిషియా...

బ్రెజిల్‌కి చెందిన రేసా లీల్  తర్వాత ఒలింపిక్ పతకం గెలిచిన అతి పిన్న వయస్కురాలిగా రికార్డు...


మీసాలు, గడ్డాలు మెరిసిన మొనగాళ్లు, ఒక్క ఒలింపిక్ పతకం గెలవడానికి అపసోపాలు పడుతున్న చోట, ఓ 13 ఏళ్ల చిన్నారి ఒలింపిక్ స్వర్ణం సాధించి, చరిత్ర సృష్టించింది. జపాన్‌కి చెందిన మోమిజీ నిషియా, స్కేట్ బోర్డింగ్ పోటీల్లో స్వర్ణం సాధించింది. ఆమె వయసు 13 ఏళ్ల 330 రోజులు. 

13 ఏళ్ల 203 రోజుల్లో ఒలింపిక్ ఛాంపియన్‌‌గా నిలిచిన బ్రెజిల్‌కి చెందిన రేసా లీల్  తర్వాత ఒలింపిక్ పతకం గెలిచిన అతి పిన్న వయస్కురాలిగా నిలిచింది మోమిజీ నిషియా. 

A historic first on home soil!'s Nishiya Momiji is the first women's Olympic champion! pic.twitter.com/6W6ReQE3BS

— Olympics (@Olympics)

Latest Videos

undefined

 

ట్రిక్స్ సెక్షన్‌లో 15.26 పాయింట్లు సాధించిన నిషియా, టోక్యో ఒలింపిక్స్‌లో మొట్టమొదటి వుమెన్స్ స్కేట్‌బోర్డింగ్ ఛాంపియన్‌షిప్‌‌గా నిలిచింది. యూఎస్‌కి చెందిన డైవర్ మర్జోరీ గెస్ట్రింగ్, 1936 బెర్లిన్ గేమ్స్‌లో తన 13 ఏళ్ల 168 రోజుల వయసులో ఒలింపిక్ పతకం సాధించి, ఒలింపిక్ పతకం సాధించిన అతిపిన్న వయస్కుడిగా నిలిచాడు.

టోక్యో ఒలింపిక్స్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన నాలుగు క్రీడల్లో స్కేట్‌బోర్డింగ్ కూడా ఒకటి. స్కేట్‌బోర్డింగ్‌తో పాటు సర్ఫింగ్, స్పోర్ట్స్ క్లైంబింగ్, కరాటేలను టోక్యో ఒలింపిక్స్ ద్వారా విశ్వక్రీడల్లో భాగం చేశారు.

click me!