గెలిచిన ఆనందంలో ఎగిరి దూకాడు... కాళ్లు విరిగి వీల్‌ ఛైయిర్‌లో...

Published : Aug 01, 2021, 04:11 PM ISTUpdated : Aug 01, 2021, 04:51 PM IST
గెలిచిన ఆనందంలో ఎగిరి దూకాడు... కాళ్లు విరిగి వీల్‌ ఛైయిర్‌లో...

సారాంశం

బాక్సింగ్ క్వార్టర్ ఫైనల్స్‌లో గెలచాననే పట్టరాని సంతోషంతో గాల్లోకి ఎగిరి సంబరాలు చేసుకున్న ఐర్లాండ్ బాక్సర్ ఐదన్ వ్లాష్... కాళ్లు బెణికి సెమీ-ఫైనల్ మ్యాచ్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. 

కొందరు అంతే... ఆవేశం వచ్చినా, ఆనందం వచ్చినా అస్సలు ఆపుకోలేరు. ఆవేశం వస్తే, బలంగా గోడకేసి కొట్టడం, కోపంగా అరిచేయండి... అదే ఆనందం వస్తే ఎగిరి గంతులేయడం చేస్తుంటాడు... అలాగే బాక్సింగ్ క్వార్టర్ ఫైనల్స్‌లో గెలచాననే పట్టరాని సంతోషంతో గాల్లోకి ఎగిరి సంబరాలు చేసుకున్న ఐర్లాండ్ బాక్సర్ ఐదన్ వ్లాష్, కాళ్లు బెణికి సెమీ-ఫైనల్ మ్యాచ్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. 

క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో మారిషస్‌కి చెందిన మెర్వెన్ క్లైర్‌ను 4-1 ఓడించిన వ్లాష్, రిఫరీ ఆ నిర్ణయం ప్రకటించిన వెంటనే పట్టరాని సంతోషంతో గాల్లోకి ఎగిరి గంతేశాడు. అయితే కిందకి జంప్ చేసేటప్పుడు బ్యాలెన్స్ తప్పడంతో తన అరికాలికి గాయమైంది. ఈ గాయం కారణంగా అతను వీల్‌ఛైయిర్ మీద వెళుతూ కనిపించాడు.

మెడికల్ చెకప్‌లో అతని ఫిట్‌గా లేడని తేలడంతో సెమీ-ఫైనల్‌లో ఐదన్ వ్లాష్‌తో పోటీపడాల్సిన బ్రిటన్ బాక్సర్ ప్యాట్ మెక్‌కరోమక్‌కి ఫైనల్‌కి వాకోవర్ లభించింది... సెమీస్ చేరిన కారణంగా ఐదన్ వ్లాష్ కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

క్వార్టర్ ఫైనల్స్ గెలవగానే ఏదో ఫైనల్ మ్యాచ్ గెలిచినట్టు ఎగరడం ఏంటని ట్రోల్ చేస్తున్నాడు ఐర్లాండ్ అభిమానులు. తన అత్యుత్సాహం కారణంగా గోల్డ్ మెడల్ గెలిచే లక్కీ ఛాన్స్ మిస్ అయ్యిందని విమర్శలు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

T20 World Cup : సంజూ vs గిల్.. భారత జట్టులో చోటుదక్కేది ఎవరికి?
IPL 2026 : 9 మంది ఆల్‌రౌండర్లతో ఆర్సీబీ సూపర్ స్ట్రాంగ్.. కానీ ఆ ఒక్కటే చిన్న భయం !