టోక్యో ఒలింపిక్స్: తొలి రౌండ్‌లోనే ఓడిన భారత బాక్సర్ వికాస్ కృష్ణన్... రక్తం కారుతున్నా పోరాడి...

By Chinthakindhi Ramu  |  First Published Jul 24, 2021, 4:38 PM IST

69 కేజీల విభాగంలో జపాన్‌ బాక్సర్ ఒకాజవా మెన్షా చేతిలో 5-0 తేడాతో ఓడిన వికాస్ కృష్ణన్...

రక్తం కారుతున్నా చివరిదాకా పోరాడి ఓడిన భారత బాక్సర్...


టోక్యో ఒలింపిక్స్‌లో భారత బాక్సర్ వికాస్ కృష్ణన్ పోరాటం తొలి రౌండ్‌లోనే ముగిసింది. 69 కేజీల మెన్స్ బాక్సింగ్ విభాగంలో జపాన్‌కి చెందిన ఒకాజవా మెన్షాతో జరిగిన మ్యాచ్‌లో వికాస్ కృష్ణన్ మూడు రౌండ్లలో ఓడి, ఒలింపిక్స్ నుంచి నిష్కమించాడు.

రక్తం కారుతున్నా చివరిదాకా పోరాడిన వికాస్ కృష్ణన్, జపాన్ బాక్సర్ జోరు ముందు నిలవలేక 5-0 తేడాతో ఓడాడు. టోక్యో ఒలింపిక్స్‌లో భారత జట్టుకి తొలి రోజు మిశ్రమ ఫలితాలు వచ్చాయి.

Latest Videos

undefined

భారీ అంచనాలతో ఒలింపిక్స్‌కి వచ్చిన ఆర్చరీ టీమ్, షూటింగ్ టీమ్ తీవ్రంగా నిరాశపరిచాయి. టేబుల్ టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్‌లో తొలి మ్యాచ్‌లోనే ఓడినా వుమన్ సింగిల్స్‌లో మాత్రం భారత జట్టుకి శుభారంభం దక్కింది.

భారత టేబుల్ టెన్నిస్ ప్లేయర్లు మానికా బత్రా, సుత్రితా ముఖర్జీ తొలి రౌండ్‌లో గెలిచి, రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు. అలాగే బ్యాడ్మింటన్ మెన్స్ డబుల్స్‌లోనూ భారత జోడి  సాత్విక్ రాజ్ రాంకీ రెడ్డి, చిరాగ్ శెట్టి మొదటి రౌండ్‌లో వరల్డ్ నెం.3  జోడిని ఓడించగా... టెన్నిస్ ప్లేయర్ సుమిత్ నగల్ తొలి రౌండ్‌లో విజయాన్ని అందుకున్నాడు.

భారత వెయిట్ లిఫ్టర్‌ మీరాభాయ్ ఛాను, రజతపతకం సాధించి... టోక్యో ఒలింపిక్స్‌లో టీమిండియాకి తొలి పతకాన్ని అందించిన విషయం తెలిసిందే.

click me!