టోక్యో ఒలింపిక్స్: క్వార్టర్స్‌లోకి భారత బాక్సర్ పూజా రాణి... ఆర్చరీలో దీపికా కుమారి...

By Chinthakindhi Ramu  |  First Published Jul 28, 2021, 3:13 PM IST

 అల్జెరియాకి చెందిన ఇచ్‌రక్ చైబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 5-0 తేడాతో ఘన విజయాన్ని అందుకున్న పూజా రాణి...

మహిళల సింగిల్స్ ఈవెంట్‌లో క్వార్టర్ ఫైనల్‌లోకి దూసుకెళ్లిన వరల్డ్ నెం.1 ఆర్చర్ దీపికా కుమారి...


టోక్యో ఒలింపిక్స్‌లో భారత వుమెన్ బాక్సర్ పూజా రాణి, క్వార్టర్ ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. 75 కేజీల విభాగంలో అల్జెరియాకి చెందిన ఇచ్‌రక్ చైబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 5-0 తేడాతో ఘన విజయాన్ని అందుకున్న పూజా రాణి, క్వార్టర్ ఫైనల్‌కి దూసుకెళ్లింది. 

ఒలింపిక్స్‌లో ఇప్పటికే మహిళా బాక్సర్ లవ్‌లీనా, క్వార్టర్ ఫైనల్‌లోకి దూసుకెళ్లగా, సీనియర్ బాక్సర్ మేరీ కోమ్ తొలి రౌండ్‌లో విజయం సాధించింది. పురుషుల విభాగంలో ఆశీష్ కుమార్, వికాస్ కృష్ణన్, మనీశ్ కౌషిక్ తొలి రౌండ్‌లోనే ఓడిపోవడం విశేషం.

Latest Videos

undefined

టోక్యో ఒలింపిక్స్ 2020లో వరల్డ్ నెం.1 ఆర్చర్ దీపికా కుమారి, మహిళల సింగిల్స్ ఈవెంట్‌లో క్వార్టర్ ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. రెండో రౌండ్‌లో అమెరికాకు చెందిన ఆర్చర్‌తో జరిగిన మ్యాచ్‌లో 6-4 తేడాతో విజయం సాధించింది దీపికా కుమారి. 

ఐదు సెట్ల పాటు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో దీపికా కుమారి పెద్దగా ఆకట్టుకునే పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయినా ఆమె అనుభవం, యంగ్ ఆర్చర్‌ను ఓడించడానికి ఉపయోగపడింది. అంతకుముందు మెన్స్ సింగిల్స్ ఈవెంట్‌లో భారత ఆర్చర్ ప్రవీణ్ జాదవ్, తరుణ్‌దీప్ రాయ్ రౌండ్ 16లో ఓడిపోయారు.

click me!