పాండ్యా ని కలిసిన 8మంది క్రికెటర్లకు కరోనా నెగిటివ్..!

Published : Jul 28, 2021, 09:43 AM ISTUpdated : Jul 28, 2021, 10:45 AM IST
పాండ్యా ని కలిసిన 8మంది క్రికెటర్లకు కరోనా నెగిటివ్..!

సారాంశం

పాండ్యాతో కాంటాక్ట్ లో ఉన్న ఎనిమిది మంది భారత క్రికెటర్లను కూడా అధికారులు గుర్తించారు. వీరిలో ఇంగ్లాండ్ టూర్ కి ఎంపికైన పృథ్వీషా, సూర్యకుమార్ యాదవ్ కూడా ఉన్నారు.

టీమిండియా ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా  కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. కృనాల్ కి పాజిటివ్ రావడంతో.. శ్రీలంక, భారత్ మధ్య జరగాల్సిన రెండో టీ20 మ్యాచ్ ను అర్థాంతరంగా వాయిదా వేశారు.

ఆ తర్వాత కృనాల్ పాండ్యాను క్వారంటైన్ కు అధికారులు తరలించారు. కాగా.. పాండ్యాతో కాంటాక్ట్ లో ఉన్న ఎనిమిది మంది భారత క్రికెటర్లను కూడా అధికారులు గుర్తించారు. వీరిలో ఇంగ్లాండ్ టూర్ కి ఎంపికైన పృథ్వీషా, సూర్యకుమార్ యాదవ్ కూడా ఉన్నారు.

ఈ టీ20 సిరీస్ తర్వాత పృథ్వీషా, సూర్యకుమార్ యాదవ్ ఇంగ్లాండ్ టూర్ కి వెళ్లాల్సి ఉంది. అయితే.. ఇప్పుడు పాండ్యాకి పాజిటివ్ రావడంతో.. వీరి ఇంగ్లాండ్ టూర్ కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉందని అధికారులు భావించారు.

అయితే.. తాజాగా పాండ్యాతో కాంటాక్ట్ లో ఉన్న ఎనిమిది క్రికెటర్లకు కరోనా పరీక్షలు నిర్వహించగా.. వారందరికీ నెగిటివ్ వచ్చినట్లు తేలింది. దీంతో.. వాయిదా పడిన మ్యాచ్.. మళ్లీ షెడ్యూల్ ప్రకారం.. నిర్వహించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. 

ఆ ఎనిమిది మంది క్రికెటర్లతోపాటు.. ఇతర క్రికెటర్లందరూ కరోనా నెగిటివ్ రావడంతో.. అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

పాండ్యా మాత్రం ఈ సిరీస్ కి దూరం అయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం పాండ్యా దగ్గు, గొంతునొప్పితో బాధపడుతున్నాడని అధికారులు చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

Team India: సూర్యకుమార్ యాదవ్‌కు షాక్.. కెప్టెన్సీ గోవిందా !
IND vs SA : సౌతాఫ్రికా చిత్తు.. భారత్ సూపర్ విక్టరీ.. సిరీస్ మనదే