టోక్యో ఒలంపిక్స్.. ఒత్తిడిలో పీవీ సింధు..!

By telugu news teamFirst Published Jul 23, 2021, 2:17 PM IST
Highlights

ఈ ఒలంపిక్స్ లో సింధు  గెలిచి.. దేశానికి పతకం తీసుకురావాలని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇదే విషయాన్ని ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ కూడా సింధుతో చెప్పారు. గెలిస్తే.. సింధుతో కలిసి ఐస్ క్రీమ్ కూడా తింటానని మాట ఇచ్చారు.
 

భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు.. టోక్యో ఒలంపిక్స్ లో తన సత్తా చాటేందుకు సిద్దంగా ఉంది. ఈ టోక్యో ఒలంపిక్స్ నేటి నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. దీంతో.. ఈ ఒలంపిక్స్ లో సింధు  గెలిచి.. దేశానికి పతకం తీసుకురావాలని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇదే విషయాన్ని ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ కూడా సింధుతో చెప్పారు. గెలిస్తే.. సింధుతో కలిసి ఐస్ క్రీమ్ కూడా తింటానని మాట ఇచ్చారు.

కాగా..ఎక్కువ ఆశలు పెట్టుకోవడంతో.. దేశానికి పతకం తీసుకురావలన్న ద్యాశలో సింధు ఎక్కువ ఒత్తిడికి గురౌతున్నట్లు తెలుస్తోంది. సింధు.. 2016 రియో ఒలంపిక్స్ లో వెండి పథకం గెలిచారు.  ఆ తర్వాత మళ్లీ గెలవలేదు. దీంతో.. ఇప్పుడు ఈ ఒలంపిక్స్ లో సింధు గెలవాలని అందరూ ఎదురుచూస్తున్నారు.

 

What a wonderful support system you have ! ❤️ | pic.twitter.com/qWj8Eqh21F

— Olympics (@Olympics)

కాగా.. తనపై అందరూ అంచనాలు పెట్టుకున్నారని..బాధ్యత కూడా ఎక్కువగా పెట్టుకున్నారని.. ఇలాంటి సమయంలో ఒత్తిడిగానే ఉంటుందని సింధు పేర్కొనడం గమనార్హం.

‘ ఇప్పుడు అందరి చూపు నా వైపు ఉంటుందని నాకు తెలుసు. రియో ఒలంపిక్స్ సమయంలో నేను ఎక్కువ మందికి తెలియదు. కానీ ఇప్పుడు ప్రజలందరూ నా ఆట చూస్తున్నారుని, నా గురించి తెలుసు అనే నేను అనుకుంటున్నాను’ అని సింధూ చెప్పింది.

ఇదిలా ఉండగా.. సింధూకి ధైర్యం  చెబుతూ.. మీమంతా నీకు ఉన్నామంటూ.. ఆమె తల్లిదండ్రులు ఇటీవల సోషల్ మీడియాలో వీడియో షేర్ చేశారు. ఈ వీడియోని అభిమానులు సైతం షేర్ ఛేస్తున్నారు. 

click me!