టోక్యో ఒలింపిక్స్: డబుల్స్‌లో సాత్విక్, చిరాగ్ శెట్టి విజయం, అయినా... షూటింగ్‌లో నిరాశే...

Published : Jul 27, 2021, 10:27 AM IST
టోక్యో ఒలింపిక్స్: డబుల్స్‌లో సాత్విక్, చిరాగ్ శెట్టి విజయం, అయినా... షూటింగ్‌లో నిరాశే...

సారాంశం

భారత డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రాంకీ రెడ్డి, చిరాగ్ శెట్టి రెండో విజయం...  గ్రూప్‌లో మూడో స్థానంలో నిలిచి, క్వార్టర్ ఫైనల్‌కి అర్హత సాధించలేకపోయిన భారత బ్యాడ్మింటన్ జోడి... షూటింగ్ మిక్స్‌డ్ ఈవెంట్‌లోనూ నిరాశే...

టోక్యో ఒలింపిక్స్‌లో బ్యాడింటన్ డబుల్స్‌లో భారత డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రాంకీ రెడ్డి, చిరాగ్ శెట్టి రెండో విజయం అందుకున్నారు. అయితే గ్రూప్‌లో మూడో స్థానంలో నిలిచిన ఈ జోడి, క్వార్టర్ ఫైనల్‌కి అర్హత సాధించలేకపోయింది.

గ్రేట్ బ్రిటన్‌కి చెందిన సాన్ వెండీ, బెన్ లీబ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జోడి సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి 21-17, 21-19 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించారు. అయితే గ్రూప్‌లో ఓ మ్యాచ్‌లో ఓడిన ఈ జోడి, క్వార్టర్ ఫైనల్‌కి అర్హత సాధించలేకపోయింది.

షూటింగ్ ఈవెంట్‌లోనూ భారత జట్టు నిరాశపరిచింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో అంజుమ్-దీపక్ కుమార్, ఎలవెనిల్ - దివ్యాంశ్ జోడి ఫైనల్స్‌కి అర్హత సాధించలేకపోయారు.

అంజుమ్, దీపిక జోడి 18వ స్థానంలో నిలవగా, ఎలవెనిల్, దివ్యాంశ్ జోడి 12వ స్థానంలో నిలిచారు. కేవలం టాప్ 8లో నిలిచినవారికే ఫైనల్స్‌లో పోటీపడేందుకు అవకాశం ఉంటుంది. 

PREV
click me!

Recommended Stories

INDW vs SLW : స్మృతి మంధాన సరికొత్త చరిత్ర.. ప్రపంచ రికార్డు బద్దలు ! లంకపై భారత్ ఘన విజయం
IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !