ఆస్ట్రేలియా ఓపెన్ 2023 టోర్నీలో ఆడబోతున్నట్టు ప్రకటించిన సానియా మీర్జా... మరో ఏడాది పాటు కొనసాగే అవకాశం...
భారత్‌లో టెన్నిస్‌కి క్రేజ్ తీసుకొచ్చిన ఘనత సానియా మీర్జాకే దక్కాలి. టెన్నిస్ మాత్రమే కాదు, సానియా మీర్జా సక్సెస్ చూసిన తర్వాత చాలామంది భారత అమ్మాయిలు.. క్రీడల వైపు దృష్టి పెట్టడం మొదలెట్టారు.
2003లో ప్రొఫెషనల్ టెన్నిస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సానియా మీర్జా, 2022 సీజన్‌యే ఆఖరిదంటూ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే సానియా మీర్జా రిటైర్మెంట్‌పై వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. గాయం కారణంగా యూఎస్ ఓపెన్ 2022 టోర్నీకి దూరమైంది సానియా మీర్జా...
undefined
2023 ఆస్ట్రేలియా ఓపెనర్‌లో రోహాన్ బోపన్నతో కలిసి బరిలో దిగబోతోంది సానియా మీర్జా. ఈ ఇద్దరూ చివరి సారిగా 2021 వింబుల్డన్‌లో ఆడాడు. వింబుల్డన్‌లో మూడో రౌండ్‌లో ఓడిన సానియా మీర్జా- రోహాన్ బోపన్న జోడీ 2016 రియో ఒలింపిక్స్‌లో క్వార్టర్ ఫైనల్ చేరినా టైటిల్ మిస్ చేసుకుంది..
గాయం కారణంగా సమ్మర్ సీజన్‌కి మిస్ కావడంతో ఈ ఏడాది మొత్తం ఆడాలని సానియా మీర్జా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. పూర్తి ఫిట్‌నెస్‌తో 2023 ఏడాది వీలైనన్ని టోర్నీలు ఆడి, సీజన్ చివర్లో రిటైర్మెంట్ తీసుకోవాలని భావిస్తోందట భారత టెన్నిస్ స్టార్..
ఒలింపిక్స్ మెడల్ గెలవాలనే కలను నెరవేర్చుకోవాలనే ఆశతో టోక్యోలో అడుగుపెట్టిన సానియా మీర్జా, రెండో రౌండ్‌లో ఓడి ఇంటి దారి పట్టింది. అయితే ఆ తర్వాత చార్లెస్‌స్టన్ ఓపెన్ 2022 టోర్నీలో ఆడిన సానియా మీర్జా, చెక్ రిపబ్లిక్ ప్లేయర్ లూసీ హ్రాడెస్కాతో కలిసి ఫైనల్ చేరి, వుమెన్స్ డబుల్స్‌లో రన్నరప్‌గా నిలిచింది...
2003లో ప్రొఫెషనల్ టెన్నిస్‌లోకి అడుగుపెట్టిన సానియా మీర్జా, తన 19 ఏళ్ల టెన్నిస్ కెరీర్‌లో ఎన్నో సంచలన విజయాలు అందుకుంది. సింగిల్స్‌లో అత్యధికంగా 27వ ర్యాంకుకి చేరుకున్న సానియా మీర్జా, డబుల్స్‌లో 2015లో వరల్డ్ నెం.1 ర్యాంకును పొందింది...
కొన్నాళ్లుగా సానియా మీర్జా విడాకుల వార్తలతో ట్రెండింగ్‌లో నిలిచింది. సానియా మీర్జా, పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ మధ్య మనస్పర్థలు వచ్చాయని, ఈ ఇద్దరూ త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు వినిపించాయి. అయితే ఇవన్నీ ఓ టాక్ షోకి ప్రచారం కల్పించడం కోసం చేసిన చీప్ ట్రిక్స్ అని తేలింది..