ఐదేండ్ల తర్వాత జట్టులోకి వచ్చాడు.. అయినా కోవిడ్ వదలలే.. పాపం రెన్షా

Published : Jan 04, 2023, 03:31 PM IST
ఐదేండ్ల తర్వాత జట్టులోకి  వచ్చాడు.. అయినా కోవిడ్ వదలలే.. పాపం  రెన్షా

సారాంశం

AUSvsSA: దేవుడు వరమిచ్చినా  పూజారి కనికరించలేదన్నట్టుగా తయారైంది ఆసీస్ క్రికెటర్ రెన్షా  పరిస్థితి. ఐదేండ్ల పాటు దేశవాళీలో  నిలకడగా రాణించి తిరిగి జట్టులోకి ఎంపికైతే కోవిడ్ కాటేసింది.    

ఆస్ట్రేలియా క్రికెటర్ మ్యాట్ రెన్షా  ఐదేండ్ల  తర్వాత తిరిగి   అంతర్జాతీయ టెస్టు మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతుండగా అతడికి అనుకోని షాక్ తాకింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు అతడికి కోవిడ్ గా నిర్ధారణ అయింది. దీంతో దేవుడు వరమిచ్చినా  పూజారి కనికరించలేదన్నట్టుగా తయారైంది అతడి పరిస్థితి. ఐదేండ్ల పాటు దేశవాళీలో  నిలకడగా రాణించి తిరిగి జట్టులోకి ఎంపికైతే కోవిడ్ కాటేసింది.  

ఆస్ట్రేలియా - దక్షిణాఫ్రికా సిరీస్ లో భాగంగా   రెన్షా కూడా  ఆసీస్  జట్టులో చోటు దక్కించుకున్నాడు. అతడు చివరిసారిగా 2018లో ఆస్ట్రేలియా తరఫున ఆడాడు.  తొలి రెండు టెస్టులలో టీమ్ మేనేజ్మెంట్ అతడిని పట్టించుకోలేదు.  కానీ మెల్‌బోర్న్ వేదికగా ముగిసిన మూడో  టెస్టుకు అతడికి పిలుపొచ్చింది. 

మ్యాచ్ కు ముందు నిర్వహించిన ర్యాపిడ్ ఆంటీజెన్ టెస్టులో  రెన్షాకు  కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అంతకుముందే అతడు.. తనకు ఒంట్లో నలతగా ఉందని టీమ్ మేనేజ్మెంట్ కు  చెప్పాడు.   అనంతరం కోవిడ్ టెస్టులో కూడా పాజిటివ్ అని తేలింది.  అయితే అతడికి పాజిటివ్ గా నిర్ధారణ అయినా  మ్యాచ్ ఆడేందుకు అనుమతి దక్కింది. అయితే మిగతా టీమ్ మెంబర్స్ తో కాకుండా   అతడు ప్రత్యేకమైన గదిలో ఉన్నాడు. 

 

కోవిడ్ వస్తే గతంలో  సదరు ఆటగాడిని  తుది జట్టు నుంచి తప్పించేవారు. కానీ ఇప్పుడు మాత్రం  మ్యాచ్ లు ఆడేందుకు అనుమతినిస్తున్నారు.  కానీ అందుకు తగు జాగ్రత్తలు మాత్రం  తప్పనిసరిగా పాటించాలి. గతేడాది కామన్వెల్త్ క్రీడల్లో భాగంగా  ఫైనల్ మ్యాచ్ లో   తహిలా మెక్‌గ్రాత్  కోవిడ్ నిర్ధారణ అయినా  మ్యాచ్ ఆడింది. 

ఇక దక్షిణాఫ్రికా - ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు విషయానికొస్తే.. తొలి రోజు ఆస్ట్రేలియా రెండు వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (54 నాటౌట్),  మార్నస్ లబూషేన్ (79 ) రాణించారు. డేవిడ్ వార్నర్.. 10 పరుగులే చేసి ఔటయ్యాడు. స్టీవ్ స్మిత్ (0 నాటౌట్), ఖవాజా లు క్రీజులో ఉన్నారు. రెన్షా  ఆరోస్థానంలో బ్యాటింగ్ కు రావాల్సి ఉంది.  

 

PREV
click me!

Recommended Stories

IND vs SA : నిప్పులు చెరిగిన భారత బౌలర్లు.. తొలి టీ20లో సౌతాఫ్రికా చిత్తు
ఒరేయ్ అజామూ.! భారత్‌లో కాదు.. పాకిస్తాన్‌లోనూ కాటేరమ్మ కొడుకు క్రేజ్ చూస్తే మతిపోతోంది