ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీ 2023 విజేతగా టీమిండియా... ఫైనల్‌లో మలేషియాపై థ్రిల్లింగ్ విక్టరీ..

By Chinthakindhi Ramu  |  First Published Aug 12, 2023, 10:45 PM IST

మలేషియాతో జరిగిన థ్రిల్లింగ్ ఫైనల్ మ్యాచ్‌లో 4-3 తేడాతో గెలిచి టైటిల్ కైవసం చేసుకున్న భారత హాకీ టీమ్... 1-3 తేడాతో వెనకబడి సూపర్ కమ్‌బ్యాక్ ఇచ్చిన టీమిండియా...


భారత పురుషుల హాకీ జట్టు, ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది. చెన్నై వేదికగా మలేషియాతో జరిగిన థ్రిల్లింగ్ ఫైనల్ మ్యాచ్‌లో 4-3 తేడాతో గెలిచి టైటిల్ కైవసం చేసుకుంది టీమిండియా. ఒకానొక దశలో హాఫ్ టైం ముగిసే సమయానికి  1-3 తేడాతో వెనకబడిన టీమిండియా, హ్యాట్రిక్ గోల్స్ సాధించి... 4-3 తేడాతో ఛాంపియన్‌గా నిలిచింది. 7 టోర్నమెంట్స్‌లో టీమిండియాకి ఇది నాలుగో టైటిల్.. 

ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీలో మొదటిసారి ఫైనల్ చేరిన మలేషియా, చివరి క్వార్టర్ వరకూ టీమిండియాకి గట్టి పోటీ ఇచ్చినా... విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. ఆధిక్యం చేతులు మారుతూ సాగిన ఫైనల్ మ్యాచ్‌‌లో ఆతిథ్య జట్టుకి హోరాహోరీ ఫైట్ ఇచ్చింది మలేషియా. మొదటి క్వార్టర్‌లో జగ్‌రాజ్ సింగ్, పెనాల్టీ కార్నర్‌ని గోల్‌గా మలిచాడు. 

Latest Videos

undefined

ఆట 9వ నిమిషంలో టీమిండియాకి మొదటి గోల్ దక్కగా, ఆట 14వ నిమిషంలో గోల్ సాధించిన మలేషియా.. స్కోర్లను 1-1 తేడాతో సమం చేసింది. ఆ తర్వాత వెంటవెంటనే మరో రెండు గోల్స్ సాధించిన మలేషియా... రెండో క్వార్టర్ ముగిసే సమయానికి 1-3 తేడాతో ఆధిక్యంలోకి వెళ్లిపోయింది.. 

ఆట 18వ నిమిషంలో, 28వ నిమిషంలో మలేషియాకి గోల్స్ దక్కాయి. మూడో క్వార్టర్‌ ఆఖర్లో 45వ నిమిషంలో వెంటవెంటనే రెండు గోల్స్ సాధించింది భారత జట్టు. దీంతో మూడో క్వార్టర్ ముగిసే సమయానికి స్కోర్లు 3-3 తేడాతో సమం అయ్యాయి. 

We Are the Champions!🏆
Here's a glimpse of the unforgettable matches 💙

🇮🇳 India 4-3 Malaysia 🇲🇾 pic.twitter.com/nosHqD3o6z

— Hockey India (@TheHockeyIndia)

అయితే సెకండ్ హాఫ్‌ని ఘనంగా ప్రారంభించింది భారత జట్టు. ఒక్క నిమిషం గ్యాప్‌లో రెండు గోల్స్ సాధించి, స్కోరును 3-3 తేడాతో సమం చేసేసింది. చివరి క్వార్టర్‌లో ఆట 56వ నిమిషంలో ఆకాశ్‌దీప్ సింగ్ గోల్ సాధించడంలో భారత జట్టు మళ్లీ 4-3 తేడాతో ఆధిక్యంలోకి వెళ్లింది.. 

ఆ ఆధిక్యాన్ని చివరి వరకూ కాపాడుకున్న టీమిండియా, టైటిల్ ఛాంపియన్‌గా నిలిచింది.  2011లో ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన టీమిండియా, ఆ తర్వాత 2016 టోర్నీలోనూ విజేతగా నిలిచింది. 2018లో ఇండియా, పాకిస్తాన్ సంయుక్త విజేతగా నిలిచాయి. 2021లో మూడో స్థానంలో నిలిచింది భారత జట్టు. 
 
ఇంతకుముందు 2012, 2013, 2018 (టీమిండియాతో కలిసి సంయుక్తంగా) టైటిల్స్ గెలిచిన పాకిస్తాన్ టీమ్‌ని అధిగమించిన టీమిండియా, ఏషియా ఛాంపియన్స్ ట్రోఫీ అత్యధిక సార్లు గెలిచిన జట్టుగా నిలిచింది. ఈసారి పాకిస్తాన్ ఏకంగా ఐదో స్థానంలో నిలిచి అట్టర్ ఫ్లాప్ పర్ఫామెన్స్ ఇవ్వడం విశేషం. 2021లో సౌత్ కొరియా టైటిల్ విజేతగా నిలిచింది.  మలేషియాతో జరిగిన సెమీ ఫైనల్‌లో సౌత్ కొరియా 6-2 తేడాతో ఓడిపోగా, జపాన్‌ని 5-0 తేడాతో చిత్తు చేసి ఫైనల్‌కి వచ్చింది భారత జట్టు.. 

click me!