''ధోనీ స్థానాన్ని భర్తీచేసేది అతడు మాత్రమే...దినేష్ కార్తిక్ కాదు''

By Arun Kumar PFirst Published Nov 10, 2018, 5:01 PM IST
Highlights

ఇటీవలే టెస్ట్ క్రికెట్‌లో ఆరంగేట్ర చేసిన రిషబ్ పంత్‌ తన సత్తా ఏంటో అతి తక్కువ మ్యాచుల్లోనే నిరూపించుకున్న విషయం తెలిసిందే.   ఇటీవల విండీస్‌తో జరిగిన టెస్ట్‌లో తన అత్యుత్తమ ఆటతీరును కనబర్చి రిషబ్  క్రికెట్ అభిమానుల్ని అలరించాడు. కేవలం అభిమానులనే కాదు ఎంతో అనుభవజ్ఞులైన మాజీలను కూడా తన ఆటతీరుతో ఆకట్టుకోగలిగాడు. ఇప్పటికే టీంఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలి అతడిపై ప్రశంసల  వర్షం కురింపించాడు. తాజాగా  మారో మాజీ ఆటగాడు కూడా రిషబ్ పంత్ ఆటతీరుపై  ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

టెస్ట్ క్రికెట్లో భారత జట్టులో మహేంద్ర సింగ్ ధోని స్థానాన్ని భర్తీ చేసే సామర్థ్యం కేవలం రిషబ్ పంత్ కు మాత్రమే ఉందంటూ మాజీ క్రికెటర్ విజయ్ దహియా పేర్కొన్నాడు. గత నాలుగు సంవత్సరాలుగా ధోనీ స్థానాన్ని ఏ ఆటగాడు భర్తీచేయలేకపోయాడని విజయ్ తెలిపాడు.తనకు వచ్చిన అవకాశాన్ని ఒడిసిపట్టుకుని ఒక్క మ్యాచ్‌లోనే రిషబ్ తానేంటో నిరూపించుకున్నాడని ప్రశంసించారు.

2014 లో టెస్ట్ క్రికెట్కు ధోనీ వీడ్కోలు పలికారు. అప్పటినుండి వికెట్ కీపింగ్ తో పాటు బ్యాటింగ్ లో సత్తా చాటే ఆటగాడు భారత్ జట్టుకు దొరకలేదు. పలు ప్రయోగాలు చేస్తూ సాహా, పార్థివ్ పటేల్, దినేష్ కార్తిక్ లతో ధోనీ స్థానాన్ని భర్తీ చేయడానికి టీం మేనేజ్ మెంట్ ప్రయత్నించారు. అయితే వీరిలో ఎవరూ ధోనీ లేని లోటును తీర్చలేకపోయారు. అయితే రిషబ్ పంత్ మాత్రం ఒక్క అవకాశంతోనే అందరిని ఆకట్టుకోగలిగాడని విజయ్ వెల్లడించాడు.

ప్రస్తుతం దినేష్ కార్తిక్, రిషబ్ పంత్ ల మధ్య పోటీ నెలకొందని....అయితే కార్తిక్ కంటే రిషబే ధోనీ స్థానాన్ని సమర్థవంతంగా భర్తీ చేయగలడని పేర్కొన్నాడు. కార్తిక్ కు చాలా అవకాశాలు లభించినప్పటికి పేలవ ఆటతీరు, గాయాల కారణంగా తనని తాను నిరూపించుకోలేకపోతున్నాడు. అయితే రిషబ్ పంత్ చాలా తక్కువ మ్యాచుల్లోనే పరిణతి చెందిన ఆటగాడిగా ఎదిగా మ్యాచ్‌ను గెలిపించే స్థాయికి వెళ్లాడన్నారు. కాబట్టి తర అభిప్రాయం ప్రకారం ధోనీకి సరితూగే ఆటగాడు రిషబేనని భావిస్తున్నట్లు విజయ్ పేర్కోన్నాడు.  
 
click me!