భయపడ్డ కోహ్లీసేన: నాలుగు రోజుల మ్యాచ్‌.. మూడు రోజులకు కుదింపు

First Published Jul 25, 2018, 3:46 PM IST
Highlights

ఇంగ్లాండ్‌లో ఐదు టెస్టుల సిరీస్‌కు సిద్ధమవవుతున్న భారత జట్టును అక్కడి విచిత్ర వాతావరణ పరిస్థితి కంగారు పెడుతోంది

ఇంగ్లాండ్‌లో ఐదు టెస్టుల సిరీస్‌కు సిద్ధమవవుతున్న భారత జట్టును అక్కడి విచిత్ర వాతావరణ పరిస్థితి కంగారు పెడుతోంది. టెస్ట్ సిరీస్‌కు ముందు ప్రాక్టీస్ కోసం ఎసెక్స్ జట్టుతో నాలుగు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్ టీమిండియా ఆడాల్సి ఉంది.. అయితే ఆ మ్యాచ్‌ను నాలుగు రోజుల నుంచి మూడు రోజులకు తగ్గించారు. మంగళవారం నెట్ ప్రాక్టీస్ చేసేందుకు రెండు గ్రూపులు టీమిండియా సభ్యులు మైదానం దిగారు. అయితే ఆ సమయంలో వేడిగాలులు క్రికెటర్లను బాగా ఇబ్బంది పెట్టాయి.

దీనిని గమనించిన కోచ్ రవిశాస్త్రి, అసిస్టెంట్ కోచ్ సంజయ్ బంగర్, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ పిచ్‌ను.. అవుట్ ఫీల్డ్‌ను పరిశీలించారు. చెత్త పిచ్‌కు తోడు అవుట్ ఫీల్డ్‌లో ఆటగాళ్లు గాయపడే అవకాశం ఉండటంతో.. అప్పటికప్పుడు ఎసెక్స్ కౌంటీ ప్రతినిధులతో మాట్లాడారు. నాలుగు రోజుల పాటు మ్యాచ్ సాధ్యం కాదని.. దానిని మూడు రోజులకు కుదించాలని రవిశాస్త్రి ప్రతిపాదించడంతో దానికి కౌంటీ సభ్యులు అంగీకారం తెలిపారు.

మూడు రోజులకు మ్యాచ్ పరిమితం కావడంతో ఈ ప్రాక్టీస్ మ్యాచ్ ఫస్ట్‌క్లాస్ హోదాను కోల్పోయింది. ఐసీసీ నిబంధనల ప్రకారం నాలుగు రోజుల మ్యాచ్‌లనే ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లుగా పరిగణిస్తారు.

click me!