ప్రపంచకప్ జట్టు ఎంపికపై జడేజా ఏమన్నాడంటే...

Published : Sep 22, 2018, 03:27 PM IST
ప్రపంచకప్ జట్టు ఎంపికపై జడేజా ఏమన్నాడంటే...

సారాంశం

ఆసియా కప్ లో భాగంగా పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా గాయంతో టోర్నీ నుండి తప్పుకోవడంతో అన్యూహంగా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా జట్టులోకి వచ్చాడు. ఇలా వస్తూనే తన బౌలింగ్ మాయ చేశాడు. శుక్రవారం జరిగిన మ్యాచ్ లో తన స్పిన్ మాయాజాలంతో బంగ్లా బ్యాట్ మెన్స్ ని ముప్పుతిప్పలు పెట్టాడు. ఇలా నాలుగు వికెట్లు పడగొట్టి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును జడేజా కైవసం చేసుకున్నాడు.

 దాదాపు ఏడాదిన్నర తర్వాత వన్డే జట్టులోకి పునరాగమనం చేసి సత్తా చాటాడు జడేజా. ఈ అద్భుత ప్రదర్శన గురించి అతడు మాట్లాడుతూ...తాను ఇంతకంటే రాటుదేలాల్సిన అవసరం ఉందని అన్నారు. తాను ఏంటో ఎవరికీ ప్రూఫ్ చేసుకోవాల్సిన అవసరం లేదని...తనతో తనకే నిత్యం పోటీ ఉంటుందన్నారు. ఇలా పునరాగమనాన్ని ఇంత ఘనంగా చాటుకోవడాన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటానని...ఈ ప్రదర్శన చాలా ఆనందాన్నించ్చిందని జడేజా తెలిపారు.

అయితే తానిప్పుడే ప్రపంచకప్ గురించి ఆలోచించడం లేదని అందుకింకా చాలా సమయం ఉందని జడేజా స్పష్టం చేశారు. అప్పటి పరిస్థితులను బట్టి జట్టు ఎంపిక ఉంటుందని...ఇప్పుడే దాని గురించి ఆలోచించడం లేదన్నారు. ప్రస్తుతానికి ఈ ఆసియాకప్ పైనే దృష్టి పెట్టానని జడేజా స్పష్టం చేశారు. 
 
PREV
click me!

Recommended Stories

ఒకే ఏడాదిలో మూడు టీ20 సెంచరీలు.. బుడ్డోడా నువ్వు కేక అసలు.. నెక్స్ట్ టీమిండియాకే
IND vs SA : వైజాగ్‌లో దబిడి దిబిడే.. భారత్‌ జట్టులో భారీ మార్పులు.. పిచ్ రిపోర్టు ఇదే