ఆరంగేట్ర మ్యాచ్‌లో మయాంక్ అదిరిపోయే రికార్డు...సునీల్ గవాస్కర్ తర్వాత

By Arun Kumar PFirst Published Dec 29, 2018, 4:48 PM IST
Highlights

ఆరంగేట్ర టెస్ట్ మ్యాచ్ లోనే టీంఇండియా యువ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ అరుదైన రికార్డును నెలకొల్పాడు. మెల్ బోర్న్ టెస్టు రెండు ఇన్నింగ్సుల్లో రాణించిన ఈ యువ
ఆటగాడు లెజెండరీ ఇండియన్ ప్లేయర్ సునీల్ గవాస్కర్ సరసన చేరాడు. 

ఆరంగేట్ర టెస్ట్ మ్యాచ్ లోనే టీంఇండియా యువ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ అరుదైన రికార్డును నెలకొల్పాడు. మెల్ బోర్న్ టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో అర్థశతకం (76పరుగులు)తో రాణించి బ్యాట్ మెన్ గా తన సత్తా ఏంటో చాటాడు.. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో జట్టులోని సీనియర్లంతా ఆసిస్ బౌలర్ల దాటికి బెంబేలెత్తుతూ వికెట్లు సమర్పించుకున్నా... మయాంక్ (42 పరుగులు) మాత్రం సంయమనంతో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఇలా రెండు ఇన్నింగ్సుల్లో రాణించిన ఈ యువ ఆటగాడు లెజెండరీ ఇండియన్ టెస్ట్ ప్లేయర్ సునీల్ గవాస్కర్ సరసన చేరాడు. 

ఇలా విదేశి గడ్డపై భారత జట్టు తరపున ఆరంగేట్ర మ్యాచ్‌లో అత్యధిక పరుగులు సాధించిన రెండో ఓపెనర్‌గా మయాంక్ అగర్వాల్ నిలిచాడు. అతడు మెల్ బోర్న్ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో 76, రెండో ఇన్నింగ్స్ లో 42 పరుగులు చేశాడు. మొత్తంగా ఆరంగేట్ర టెస్ట్ మ్యాచ్ లో 118 పరుగులు సాధించాడు. 

ఇతడి కంటే ముందు ఈ జాబితాలో భారత లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఉన్నాడు. అతడు కూడా విదేశాల్లో జరిగిన మ్యాచ్ ద్వారానే టెస్టుల్లో ఆరంగేట్రం చేశాడు. అలా టీంఇండియా తరపున ఓపెనర్ గా బరిలోకి దిగిన గవాస్కర్ మొత్తం 132 పరుగులు చేశాడు. ఇలా కెరీర్ ఆరంభ మ్యాచ్ లో అత్యధిక పరుగులు చేసిన భారతీయ ఆటగాడిగా గవాస్కర్ నిలిచాడు. 

ఇక ఇప్పటివరకు గవాస్కర్ తర్వాతి స్థానంలో నిలిచిన రాజ్‌పుత్( 93 పరుగులు) ను వెనక్కి నెట్టి మయాంక్ ఆ స్ధానాన్ని కైవసం చేసుకున్నాడు. మొత్తంగా మెల్ బోర్న్ టెస్టులో భారత జట్టు విజయానికి చేరువచేసి హీరోగా మారిన మయాంక్...వ్యక్తిగత రికార్డులతో కూడా తన క్రేజ్ పెంచుకున్నాడు. 

click me!