సీనియర్ల కంటే ఆ యువ ఆటగాడే బెటర్...ఓవర్‌సీస్‌ హీరో: రవిశాస్త్రి

By Arun Kumar PFirst Published Feb 5, 2019, 7:43 PM IST
Highlights

భారత జట్టుకు కుల్దీప్ యాదవ్ రూపంలో ఓ నాణ్యమైన స్పిన్నర్ లభించాడని టీంఇండియా కోచ్ రవిశాస్త్రి ప్రశంసించాడు. ప్రస్తుతం భారత జట్టులో నంబర్ వన్ స్పిన్నర్ కుల్దీపేనంటూ ఆకాశానికెత్తేశాడు. సీనియర్ ఆటగాళ్లకంటే కుల్దీప్ మెరుగ్గా ఆడుతున్నాడంటూ రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలకు రవిశాస్త్రి చురకలు అంటించాడు. 

ప్రస్తుతం విదేశీ పర్యటనలో భారత జట్టు వరుస విజయాలను సాధించడంలో కుల్దీప్ మణికట్టు మాయాజాలం బాగా ఉపయోగపడిందని రవిశాస్త్రి అన్నారు. ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరిగిన టెస్టులో కుల్దీప్ అత్యుత్తమ ఆటతీరుతో ఐదు వికెట్లు పడగొట్టడాన్ని గుర్తుచేస్తూ...ఈ ప్రదర్శన తన ప్రతిభను బయటపెట్టడానికి ఉపయోగపడిందన్నారు. ఈ అద్భుత ప్రదర్శన తనను కూడా ఎంతగానో ఆకట్టుకుందన్నాడు. ఒకవేళ జట్టులోకి ఒకే స్పిన్నర్‌ని తీసుకొనే అవకాశం ఉంటే ఖచ్చితంగా కుల్దీప్ నే తీసుకుంటామని శాస్త్రి వెల్లడించాడు. 

టీంఇండియా స్పిన్ సంచలనం రవిచంద్రన్ అశ్విన్ కంటే ప్రస్తుతం కుల్దీపే మెరుగైన స్పిన్నర్‌ అని ఆయన అన్నారు. ఎప్పుడూ సమయం ఒకేలా ఉండదు..ఒక్కో సమయం ఒక్కొక్కరికి అనుకూలంగా ఉంటుందన్నాడు. ప్రస్తుతం మారుతున్న సమీకరణాలను బట్టి చూస్తే కుల్దీప్‌ నెం.1 బౌలర్ గా కనిపిస్తున్నాడని తెలిపాడు. విదేశాల్లో తన స్పిన్ బౌలింగ్ తో అదరగిడుతున్న కుల్దీప్ ను ఓవర్‌సీస్ హీరో అంటూ రవిశాస్త్రి పొగిడ్తలతొ ముంచెత్తాడు. 
 
click me!