వరల్డ్ కప్‌ టోర్నీలో పాకిస్థాన్ సారథి అతడే: పిసిబి క్లారిటీ

By Arun Kumar PFirst Published Feb 5, 2019, 5:08 PM IST
Highlights

జాతి వివక్ష వ్యాఖ్యలతో దుమారం రేపిన పాకిస్థాన్  కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌ను పిసిబి(పాకిస్థాన్ క్రికెట్ బోర్డు) మరోసారి వెనకేసుకు వచ్చింది. ఐసిసి విధించిన ఐదు వన్డేల నిషేదం ముగిసిన తర్వాత పాక్ జట్టు పగ్గాలు మళ్లీ సర్పరాజ్ కే అప్పగించనున్నట్లు ప్రకటించింది. అంతర్జాతీయ జట్ల మధ్య ప్రతిష్టాత్మకంగా జరిగే మెగా టోర్నీ వన్డే వరల్డ్ కప్ లో కూడా పాక్ జట్టుకు సర్పరాజే సారధ్యం వహిస్తాడని పిసిబి తాజాగా ప్రకటించింది. 
 
ఇటీవల దక్షిణాఫ్రికాతో మ్యాచ్ సందర్భంగా ఫీల్డింగ్ చేస్తూ పాక్ కెప్టెన్ సర్పరాజ్ అసహనానికి గురయ్యాడు. ఈ సందర్భంగా బ్యాటింగ్ చేస్తూ క్రీజులో పాతుకుపోయిన సపారీ ఆల్ రౌండర్ పెహ్లువాకియాను  ఉద్దేశించి ‘‘ఓరేయ్ నల్లోడా..మీ అమ్మ ఇవాళ ఎక్కడ కూర్చొంది. ఈ రోజు నీ కోసం ఆమెతో ఏం మంత్రం చదివించుకుని వచ్చావు’’అంటూ ఉర్దూలో దూషించాడు. ఈ మాటలు కాస్తా మైదానంలోని స్టంప్‌ మైక్‌లో స్పష్టంగా రికార్డయ్యాయి. దీంతో వివాదం చెలరేగింది. 

ఈ  వ్యాఖ్యల నేపధ్యంలో అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో సర్ఫరాజ్ క్షమాపణలు కూడా చెప్పాడు. అయితే ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ఐసిసి సర్పరాజ్ పై ఐదు వన్డేల నిషేదం విధించింది. అయితే క్షమాపణలు కోరినా తమ ఆటగాడిపై ఐసిసి ఇలా కఠినంగా వ్యవహరించడంపై పిసిబి ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తమకు, దక్షిణాప్రికా క్రికెట్ బోర్డుకు లేని అభ్యంతరం ఐసిసికి ఎందుకున్నది పిసిబి వాదన. 

ఇలా గతం నుండి సర్పరాజ్ ను వెనకేసుకు వస్తున్న పిసిబి మరోసారి అతడికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ జట్టు కోసం సర్పరాజ్ చాలా కష్టపడ్డాడని...అలాంటి ఆటగాన్ని కెప్టెన్సీ నుంచి తప్పించడం కుదరదని పిసిసి స్పష్టం చేసింది. సర్ఫరాజే మా కెప్టెన్ అనడంలో ఎటువంటి సందేహం లేదని ప్రకటించింది. నిషేదం ముగిసిన తర్వాత జరగనున్న ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌‌కు కూడా సర్పరాజే జట్టు కెప్టెన్సీ బాధ్యతలు చేపడతాడని పిసిబి పేర్కొంది. 

click me!