భారత్‌-పాక్ మ్యాచ్‌ వివాదంపై స్పందించిన కోహ్లీ... (వీడియో)

By Arun Kumar PFirst Published Feb 23, 2019, 2:56 PM IST
Highlights

పుల్వామా దాడి నేపథ్యంలో భారత్-పాక్ దేశాల మధ్య సంబంధాలు మరింత దిగజారాయి.  ఈ ప్రభావం ఇరుదేశాల క్రికెట్ వ్యవహారాలపైనే కాదు ఐసిసి నిర్వహించే అంతర్జాతీయ క్రికెట్ టోర్నమెంట్ పై పడింది. ప్రస్తుతం ఈ మెగా టోర్నీలో అత్యంత ఆదరణ కలిగిన భారత్-పాక్ మ్యాచ్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. పాక్ తో మ్యాచ్ ను భారత్ బహిష్కరించాలని మాజీలు, అభిమానులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ వ్యవహారంపై టీంఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించారు.

విశాఖ పట్నంలో ఆదివారం భారత్-ఆస్ట్రేలియా మధ్య టీ20 సీరీస్ ప్రారంభకానుంది. ఈ సందర్భంగా ఇప్పటికే టీంఇండియా ఆటగాళ్లంతా వైజాగ్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాతో జరగనున్న టీ20, వన్డే సీరిస్ ల గురించి మాట్లాడారు.  అనంతరం పుల్వామా దాడి, ప్రపంచ కప్ లో భారత్-పాక్ మ్యాచ్ గురించి కూడా కోహ్లీ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.

పుల్వామాలో భారత సైనికులపై జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కోహ్లీ తెలిపాడు. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించాడు. ప్రపంచ కప్ టోర్నీలో పాక్ తో మ్యాచ్ ఆడకూడదంటూ వస్తున్న డిమాండ్ పై కేంద్ర ప్రభుత్వం, బిసిసిఐ నిర్ణయం తీసుకుంటాయని  కోహ్లీ తెలిపాడు. వారి ఆదేశాలను తాము శిరసావహిస్తామని పేర్కొన్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా దానికి భారత జట్టు మొత్తం కట్టుబడి వుంటుందని కోహ్లీ వెల్లడించారు.   

వీడియో

Virat Kohli on Ind Vs Pak in World Cup says, "Our sincere condolences to the families of CRPF soldiers who lost their lives in . We stand by what the nation wants to do and what the BCCI decides to do." pic.twitter.com/gjyJ9qDxts

— ANI (@ANI)

click me!