అలా చేస్తే పాక్‌కు భారత్ సాయం చేసినట్లే: సచిన్

By Arun Kumar PFirst Published Feb 22, 2019, 8:16 PM IST
Highlights

ప్రపంచ కప్ వంటి మెగా టోర్నీలో భారత్ శతృదేశమైన పాకిస్థాన్ కు సహాయం చేయాలని తాను కోరుకోవడంలేదని  టీమిండియా లెజెండరీ మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అభిప్రాయపడ్డారు. పాకిస్థాన్ జట్టుతో టీంఇండియా తలపడకుండా బహిష్కరిస్తే రెండు పాయింట్లు పాక్ ఖాతాలో చేరతాయి. దీంతో పాక్ కు లబ్థి చేకూరుతుందని...కాబట్టి భారత్ అలా  చేయకుంటేనే బావుంటుందని సచిన్ అభిప్రాయపడ్డారు. 

ప్రపంచ కప్ టోర్నీ చరిత్ర తీసుకుంటే పాక్ పై ప్రతిసారి భారత జట్టే పైచేయి సాధించింది. ఈ ప్రపంచ కప్ లో కూడా చరిత్ర మళ్లీ పునరావృతం అవుతుందని సచిన్ ఆశాభావం వ్యక్తం చేశారు. అలా పాక్‌ను చిత్తుగా ఓడించే అవకాశాన్ని భారత్ వదులుకోవద్దని సచిన్ సూచించారు. 

అయితే భారత్-పాక్ మ్యాచ్ విషయంలో భారత ప్రభుత్వం, బిసిసిఐ నిర్ణయమే ఫైనల్ అని సచిన్ అన్నారు. ఆ నిర్ణయం ఏదైనా తాను మనస్పూర్తిగా ఆహ్వానిస్తానని పేర్కొన్నారు. 

పుల్వామాలో భారత సైనికులను పొట్టనబెట్టుకున్న జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు పాకిస్ధాన్ ఆశ్రయం కల్పిస్తోంది. అంతేకాకుండా ఈ దాడిలో ఉగ్రవాదులకు పాక్ ఆర్మీ సాయం చేసినట్లు కూడా తేటతెల్లమైంది. ఈ నేపథ్యంలో ప్రపంచ కప్ వంటి మెగా టోర్నీలో భారత్-పాక్  మ్యాచ్ పై  వివాదం చెలరేగుతుంది. కొందరు పాక్ తో మ్యాచ్ బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. మరికొందరేమో అలా చేయడం వల్ల పాక్ జట్టుకే లబ్ది చేకూరుతుంది కాబట్టి వద్దంటున్నారు. ఇలా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం, బిసిసిఐ తీసుకునే నిర్ణయం ఉత్కంఠ నెలకొంది.  

click me!