సారీ చెప్పి భజ్జీ ఏడ్చేశాడు: మంకీ గేట్ పై సైమండ్స్

Published : Dec 17, 2018, 07:15 AM IST
సారీ చెప్పి భజ్జీ ఏడ్చేశాడు: మంకీ గేట్ పై సైమండ్స్

సారాంశం

సైమండ్స్‌, హర్భజన్‌ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు కలిసి ఆడారు. ఆ సందర్భంగా ఓ రోజు పార్టీలో హర్భజన్‌ తన వద్దకు వచ్చి అప్పటి మంకీగేట్‌ సంఘటనకు క్షపమాణ చెబుతూ, ఒక్కసారిగా ఏడ్చాడని సైమండ్స్‌ తెలిపాడు. 

పెర్త్‌: మంకీగేట్‌ కు సంబంధించి భారత ఆఫ్‌ స్పిన్నర్‌ తనకు క్షమాపణ చెప్పాడని ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్‌ ఆండ్రూ సైమండ్స్‌ చెప్పాడు. 2008లో సిడ్నీ టెస్ట్‌ సందర్భంగా సైమండ్స్‌నుద్దేశించి హర్భజన్‌ మంకీ అని చేసిన వ్యాఖ్య తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. 

ఆ తర్వాత సైమండ్స్‌, హర్భజన్‌ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు కలిసి ఆడారు. ఆ సందర్భంగా ఓ రోజు పార్టీలో హర్భజన్‌ తన వద్దకు వచ్చి అప్పటి మంకీగేట్‌ సంఘటనకు క్షపమాణ చెబుతూ, ఒక్కసారిగా ఏడ్చాడని సైమండ్స్‌ తెలిపాడు. 

తనపై ఉన్న బరువును హర్భజన్ సారీ చెప్పి ఏడ్వడం ద్వారా దించేసుకున్నాడని సైమండ్స్ అన్నాడు. భజ్జీ కరచాలనం చేశాడని, తాను కౌగలించుకున్నానని చెప్పాడు.

తాను ఏడ్చాననడం సైమండ్స్‌ అల్లిన కట్టు కథ అని హర్భజన్‌ కొట్టిపారేశాడు. ట్విట్టర్ వేదికగా సైమండ్స్ మాటలను ఆయన ఖండించాడు.

 

PREV
click me!

Recommended Stories

IPL 2026 ముందు గుజరాత్ టైటాన్స్‌కు బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్ కు గాయం
విజయ్ హజారే ట్రోఫీలో యువ ఆటగాళ్ల జోరు.. దెబ్బకు సెలెక్టర్లు బేజారు..