పెర్త్ టెస్ట్: ముగిసిన ఆట, 175 పరుగుల ఆధిక్యంలో ఆసీస్

By sivanagaprasad KodatiFirst Published Dec 16, 2018, 11:36 AM IST
Highlights

బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్‌లో భారత్‌-ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌లో మూడవ రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 4 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. 

బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్‌లో భారత్‌-ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌లో మూడవ రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 4 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్‌కు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని అందించారు.

ప్రారంభం నుంచి దూకుడుగా ఆడిన ఓపెనర్లు మార్కస్ హారిస్, అరోన్ ఫించ్ గతి తప్పిన బంతులను బౌండరీలకు తరలించారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని బుమ్రా విడగొట్టాడు. 17.2 ఓవర్ వద్ద బుమ్రా బౌలింగ్‌లో హారీస్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

ఆ తర్వాత గాయం కారణంగా ఫించ్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే షాన్ మార్ష్‌ను షమీ వెనక్కి పంపాడు. ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు ప్రయత్నించిన హ్యాండ్స్‌కాంబ్, ఉస్మాన్ ఖవాజాల జోడీని ఇషాంత్ విడదీశాడు.

శర్మ బౌలింగ్‌లో కాంబ్ ఎల్బీగా ఔట్ అయ్యాడు. ఆ తర్వాత ట్రేవిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజాలు కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. నాలుగో వికెట్‌కు 35 పరుగులు జోడించిన తర్వాత షమీ బౌలింగ్‌లో ట్రేవిస్ హెడ్ పెవిలియన్‌కు చేరాడు.

ప్రస్తుతం ఆసీస్ 48 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. కెప్టెన్ టీమ్ పెయిన్ 8, ఉస్మాన్ ఖవాజా 41 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకు మందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 283 పరుగులకు అలౌట్ అయ్యింది. దీంతో ఆసీస్ 175 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.

click me!