స్వీడన్ గెలిచెన్.. దక్షిణ కొరియా పోరాడి ఓడెన్

First Published Jun 19, 2018, 11:16 AM IST
Highlights

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఆండ్రియాస్ గ్రాన్‌క్విస్ట్

హైదరాబాద్: 16 ఏళ్ళ తర్వాత ఫిఫా వరల్డ్ కప్‌కు క్వాలిఫై అయిన దక్షిణ కొరియా తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైంది. ఆసియా ఖండం నుంచి టోర్నమెంట్‌కు క్వాలిఫై అయిన రెండో టీమ్‌గా పేరొందిన ఈ జట్టు, నిజ్నీ నొవ్‌గొరొడ స్టేడియంలో సోమవారం జరిగిన గ్రూప్‌ ఎఫ్‌ మ్యాచ్‌లో స్వీడన్‌ చేతిలో 1-0 తేడాతో పరాజయం పొందింది. దీంతో స్వీడన్ వరల్డ్ కప్‌లో బోణి చేసింది. 


కెప్టెన్ ఆండ్రియాస్ గ్రాన్‌క్విస్ట్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. చివరిదాకా పోరాడి ఓడిన దక్షిణ కొరియా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.ఫస్టాఫ్‌లో రెండు టీమ్స్ ఒక్క గోల్ కూడా చేయలేదు. దీంతో ఫుట్‌బాల్ ఫ్యాన్స్ నిరాశ చెందారు.సెకండాఫ్ 65వ నిముషం వద్ద స్వీడన్‌కు పెనాల్టి కిక్ చేసే అవకాశం లభించింది. టీమ్ స్కిప్పర్ గ్రాన్‌క్విస్ట్ ఆ అవకాశాన్ని అద్భుతంగా మలచుకొని గోల్ చేశాడు. స్వీడన్‌కు 1-0 ఆధిక్యతను సంపాదించి పెట్టాడు. ఆఖరిదాకా అదే ఆధిక్యతను కొనసాగించిన స్వీడన్ వరల్డ్ కప్‌లో మొదటి గెలుపును నమోదు చేసుకుంది. ప్లే ఆఫ్స్‌లో మాజీ చాంపియన్ ఇటలీని కంగు తినిపించిన స్వీడన్ పదేళ్ళ తర్వాత వరల్డ్ కప్‌కు క్వాలిఫై అయ్యింది. 2006 వరల్డ్ కప్‌లో 16వ రౌండ్‌లో జర్మనీ చేతిల నాకౌటైంది. అండర్ డాగ్‌గా వరల్డ్ కప్ బరిలోకి దిగిన దక్షిణ కొరియాకు సమీకరణలు మార్చే సత్తా ఉంది. అతి కష్టమ్మీద క్వాలిఫై అయ్యింది. 

click me!