స్పాట్ ఫిక్సింగ్..లంక క్రికెట్ దిగ్గజం జయసూర్యపై ఐసీసీ యాక్షన్

By sivanagaprasad kodatiFirst Published Oct 16, 2018, 7:48 AM IST
Highlights

శ్రీలంక క్రికెట్ దిగ్గజం సనత్ జయసూర్యపై ఐసీసీ కన్నెర్ర చేసింది.. గతేడాది జూలైలో శ్రీలంక, జింబాబ్వేలో మధ్య  హంబన్‌టోటలో జరిగిన నాలుగో వన్డేలో స్పాట్ ఫిక్సింగ్ జరిగినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. 

శ్రీలంక క్రికెట్ దిగ్గజం సనత్ జయసూర్యపై ఐసీసీ కన్నెర్ర చేసింది.. గతేడాది జూలైలో శ్రీలంక, జింబాబ్వేలో మధ్య  హంబన్‌టోటలో జరిగిన నాలుగో వన్డేలో స్పాట్ ఫిక్సింగ్ జరిగినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి.

అత్యంత బలహీనమైన జింబాబ్వే జట్టు.. శ్రీలంకపై ఆ మ్యాచ్ గెలవడంతో పాటు ఆ తర్వాత ఏకంగా 3-2 తేడాతో సిరీస్‌ను కూడా గెలుచుకుంది. దీనిపై క్రికెట్ ప్రపంచం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఐసీసీ విచారణకు ఆదేశించింది.

ఐతే తాను సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా ఉన్న సమయంలో చోటు చేసుకున్న పరిణామాలపై ఐసీసీ జరుపుతున్న దర్యాప్తుకు అడ్డుతగులుతున్నట్లు అతడిపై ఆరోపణలు ఉన్నాయని లంక క్రికెట్ వర్గాలు తెలిపాయి. విషయం ఐసీసీ దృష్టికి వెళ్లడంతో జయసూర్యపై అభియోగాలు నమోదు చేసింది.. దీనిపై వివరణ ఇచ్చేందుకు రెండు వారాల సమయం ఇచ్చింది. 
 
click me!