
టీమిండియా క్రికెటర్లకు బీసీసీఐ చీఫ్ సెలక్టర్ ఎంఎస్‌కే ప్రసాద్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. జాతీయ జట్టులో ఆటగాళ్లకు తగినన్ని అవకాశాలు ఇస్తున్నా సరైన ప్రదర్శన చేయలేకపోతున్న వారిని పక్కనబెట్టడానికి ఇక వెనుకాడబోమని ఆయన హెచ్చిరించారు.
సీనియర్లు విఫలమైతే... దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేస్తున్న కుర్రాళ్లపై తాము దృష్టి పెట్టాల్సి వుంటుందని ప్రసాద్ చెప్పారు. ఇంగ్లాండ్‌తో ఆఖరి టెస్టులో రిషబ్ పంత్ బ్యాటింగ్ తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నాడు.
అతని బ్యాటింగ్‌పై తనకు ఎలాంటి అనుమానం లేదన్నారు... కానీ అతని కీపింగ్ ఇంకా మెరుగుపడాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఆసియాకప్‌లో కోహ్లికి విశ్రాంతి ఇచ్చినట్లే.. వెస్టిండీస్‌తో సిరీస్‌లో కూడా కొందరు ఆటగాళ్లకు విశ్రాంతి ఇస్తామని.. అద్భుతంగా రాణిస్తున్న మయాంక్ అగర్వాల్‌కు త్వరలోనే అవకాశం వస్తుందని ప్రసాద్ పేర్కొన్నారు.