ఐదో వన్డేలో ధోని ఆడటం కన్ఫర్మ్...

By Arun Kumar PFirst Published Feb 2, 2019, 6:05 PM IST
Highlights

న్యూజిలాండ్ తో జరుగుతున్న ఐదు వన్డేల సీరిస్ ఇప్పటికే టీంఇండియా కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వరుసగా మూడు వన్డేల్లో విజయం సాధించి సీరిస్ కైవసం చేసుకోవడంతో నాలుగో వన్డే నుండి భారత సీనియర్లు విశ్రాంతి తీసుకున్నారు.దీంతో యువ ఆటగాళ్లపై చెలరేగిపోయిన న్యూజిలాండ్ జట్టు కేవలం 92 పరుగులకే ఆలౌట్ చేసింది.

న్యూజిలాండ్ తో జరుగుతున్న ఐదు వన్డేల సీరిస్ ఇప్పటికే టీంఇండియా కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వరుసగా మూడు వన్డేల్లో విజయం సాధించి సీరిస్ కైవసం చేసుకోవడంతో నాలుగో వన్డే నుండి భారత సీనియర్లు విశ్రాంతి తీసుకున్నారు.దీంతో యువ ఆటగాళ్లపై చెలరేగిపోయిన న్యూజిలాండ్ జట్టు కేవలం 92 పరుగులకే ఆలౌట్ చేసింది.

అయితే వన్డే ప్రపంచ కప్ కు ముందు భారత జట్టు ఘోర పరాజయం పాలవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇలాంటి ప్రదర్శనే ప్రపంచకప్ లో పునరావృతం అయితే పరిస్థితి ఏంటని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. దీంతో ఐదో వన్డేలో కూడా ఇలాగే యువ క్రికెటర్లతో బరిలోకి దిగి ఏదైనా పొరపాటు జరిగితే ఈ విమర్శలు మరీ ఎక్కువయ్యే అవకాశం వుండటంతో టీంఇండియా మేనేజ్ మెంట్ ముందుగానే అప్రమత్తమయ్యింది. 

 న్యూజిలండ్ తో జరుగుతున్న మూడు, నాలుగు వన్డేలకు తొడ కండరాల గాయంతో దూరమైన భారత మాజీ కెప్టెన్, సీనియర్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనిని ఐదో వన్డేలో ఆడించాలని జట్టు మేనేజ్ మెంట్ భావిస్తోంది. ఇప్పటికే ధోని గాయం నుండి కోలుకుని పిట్ నెస్ సాధించాడని...రేపు(ఆదివారం) జరిగే  ఐదో వన్డేలో అతడు ఆడతాడని టీమిండియా సహాయ కోచ్ సంజయ్ భంగర్ తెలిపారు. ధోనీ రాకతో మిడిలార్డన్ మరింత బలపడుతుందని ఆయన తెలిపాడు. 

ఈ ఐదు వన్డేల సీరిస్ లో మొదటి రెండు మ్యాచుల్లో ధోని ఆడాడు. అయితే మొదటి మ్యాచ్ లో అతడికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. రెండో వన్డేలో చివర్లో ధోని మెరుపు బ్యాటింగ్(33 బంతుల్లో 48 పరుగులు) తో ఆకట్టుకోవడంతో భారత్ 324 పరుగుల భారీ స్కోరు సాధించింది. అయితే ఆ మ్యాచ్ తర్వాత గాయం మిగతా రెండు వన్డేలకు దూరమయ్యాడు. 

వరుసగా మూడ వన్డేలు గెలిచి సీరిస్ కైవసం చేసుకోవడంతో టీంఇండియా కెప్టెన్ కోహ్లీ కూడా నాలుగో వన్డేకు దూరమయ్యాడు. దీంతో యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు కేవలం 92 పరుగులకే ఆలౌటయ్యింది. దీంతో ఇలాంటి పరాజయం మళ్లీ ఎదురుకాకుండా వుండేందుకు అనుభవజ్ఞుడైన ధోనిని మళ్లీ జట్టులోకి తీసుకువచ్చింది  టీంఇండియా మేనేజ్‌మెంట్.      

click me!