తలకు చున్నీ లేదని.. భారత క్రీడాకారిణీని గెంటేసిన ఇరాన్

First Published Jun 13, 2018, 12:03 PM IST
Highlights

తలకు చున్నీ లేదని.. భారత క్రీడాకారిణీని గెంటేసిన ఇరాన్

ప్రపంచం అన్ని రంగాల్లో ఎంతో ముందుకు వెళుతున్నా.. మత భావజాలం, కట్టుబాట్లు కొన్ని దేశాల్లో మనిషి ఎదుగుదలను అడ్డుకుంటూనే ఉన్నాయి. అవి పాటించని వారిని అవమానిస్తూనే ఉన్నాయి. తాజాగా భారత చెస్ ఉమెన్ గ్రాండ్ మాస్టర్, మాజీ వరల్డ్ జూనియర్ గార్ల్స్ ఛాంపియన్ సౌమ్యా స్వామినాథన్‌కు ఇలాంటి కట్టుబాట్ల వల్ల ఘోర అవమానం జరిగింది.  ఆసియన్ టీమ్ ఛాంపియన్ షిప్ ఇరాన్‌లోని హమదాన్‌లో ప్రారంభమయ్యాయి.

అయితే ఇరాన్ కట్టుబాట్ల  కారణంగా టోర్నీలో పాల్గొనే మహిళలంతా విధిగా తల చుట్టూ చున్నీ( హెడ్ స్కార్ఫ్) ధరించాలి.. నిర్వాహకులు కూడా ఇదే విషయాన్ని మహిళా క్రీడాకారులకు తెలియజేశారు.. అయితే ఈ నిబంధనను తాను శిరసావహించనని.. సౌమ్య వాదించారు. నా తలకు చున్నీ లేదా బుర్ఖాను బలవంతంగా ధరించడం నాకు ఇష్టం లేదు. ఇరాన్ చట్టంలోని ఈ నిబంధన నా మానవ హక్కులకు భంగం కలిగించేలా.. వ్యక్తిగత స్వేచ్ఛను దెబ్బతీసేలా ఉందని చెప్పింది.

దీంతో ఆమెను టోర్నీ నుంచి బహిష్కరిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. దీంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.. కాగా, 2016లో ఇండియన్ షూటర్ హీనా సింధూ కూడా ఇలాంటి కారణంతోనే పోటీల నుంచి వైదొలిగారు. 

click me!