సారీ, రషీద్ ఖాన్ ను ఇవ్వం: మోడీకి చెప్పేసిన ఘనీ

First Published May 26, 2018, 1:34 PM IST
Highlights

ఐపియల్ క్వాలిఫయిర్ - 2 మ్యాచులో రషీద్ ఖాన్ ప్రదర్శనకు అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ ఉబ్బి తబ్బిబ్బయ్యారు.

హైదరాబాద్: ఐపియల్ క్వాలిఫయిర్ - 2 మ్యాచులో రషీద్ ఖాన్ ప్రదర్శనకు అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ ఉబ్బి తబ్బిబ్బయ్యారు. రషీద్ ఖాన్ ను భారత్ కు ఇవ్వబోమని ఆయన ట్విట్టర్ లో చెబుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీకి ట్యాగ్ చేశారు. 

కోల్ కతా నైట్ రైడర్స్ పై సన్ రైజర్స్ జట్టును అఫ్గాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ ఒంటి చేతితో గెలిపించిన విషయం తెలిసిందే. బ్యాటింగ్ లోనూ, బౌలింగులో విశేషమైన ప్రతిభ కనబరిచిన అతనిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. అతనికి భారత పౌరసత్వం ఇవ్వాలని కొంత మంది నెటిజన్లు కోరారు.

దానిపై అఫ్గన్ అధ్యక్షుడు ఘనీ స్పందిస్తూ సాధారణ ధోరణిలో తాము రషీద్ ను ఇవ్వబోమని అన్నారు. రషీద్ ఖాన్ 10 బంతుల్లో 34 పరుగులు చేశాడు. 10 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి కోల్ కతా నైట్ రైడర్స్ 93 పరుగులు చేసిన నేపథ్యంలో రషీద్ ఖాన్ బౌలింగుకు దిగి మూడు వికెట్లు తీశాడు. వరుసగా రెండు క్యాచులు పట్టాడు. అదే కోల్ కత్తాను పరాజయంలోకి నెట్టింది. 

తమ హీరో రషీద్ ఖాన్ విషయంలో తాము గర్వపడుతున్నామని, తన ప్రతిభను చాటడడానికి తమ ఆటగాళ్లకు వేదికను కల్పించిన భారత మిత్రులకు ధన్యవాదాలు తెలుపుతున్నానని,  ప్రపంచ క్రికెట్ కు అతనో ఆస్తి అని ఘనీ ట్వీట్ చేస్తూ అతన్ని మీకు ఇవ్వడం లేదని మోడీకి ట్యాగ్ చేశారు. 

click me!