రషీద్ ఖాన్ మనసులు దోచుకున్నాడంతే..: సుష్మా ఏమన్నారంటే...

First Published May 26, 2018, 1:06 PM IST
Highlights

ఐపిఎల్ క్వాలిఫయర్ - 2 మ్యాచులో కోల్ కత్తా నైట్ రైడర్స్ పై చేసిన ప్రదర్శనతో రషీద్ ఖాన్ హీరో అయిపోయాడు.

హైదరాబాద్: ఐపిఎల్ క్వాలిఫయర్ - 2 మ్యాచులో కోల్ కత్తా నైట్ రైడర్స్ పై చేసిన ప్రదర్శనతో రషీద్ ఖాన్ హీరో అయిపోయాడు. ఆల్ రౌండ్ ప్రదర్శనకు ఆయనపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. నెటిజన్ల విజ్ఞప్తికి భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ స్పందించాల్సి వచ్చింది.

శుక్ర‌వారం జ‌రిగిన క్వాలిఫ‌య‌ర్‌-2 మ్యాచ్‌లో ర‌షీద్ ప్ర‌ద‌ర్శ‌న వల్లనే స‌న్‌రైజ‌ర్స్ జ‌ట్టును ఫైన‌ల్‌కు చేరిందంటే అతిశయోక్తి లేదు. "అఫ్గాన్ క్రికెట్ బోర్డుతో బీసీసీఐ ఓ ఒప్పందం చేసుకోవాలి. ఆ ఒప్పందం ప్ర‌కారం రవీంద్ర జ‌డేజాను అఫ్గానిస్తాన్‌కు ఇచ్చేసి.. ర‌షీద్‌ను ఇండియా త‌ర‌ఫున ఆడించాలి" అని నెటిజన్లు ట్వీట్లుి చేశారు. 
ర‌షీద్‌కు భార‌త పౌర‌స‌త్వం ఇవ్వాల‌ని కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వ‌రాజ్‌ను కోరుతూ మరికొంత మంది ట్వీట్లు చేశారు. ఆ ట్వీట్ల వరదకు మంత్రి సుష్మా స్వరాజ్ స్పందించాల్సి వచ్చింది. `మీరంతా చేస్తున్న ట్వీట్లు చూస్తున్నాను. ఆ విష‌యాన్ని కేంద్ర హోం శాఖ చూసుకుంటుంది` అని ఆమె జవాబిచ్చారు. 
ర‌షీద్‌ఖాన్‌పై మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ కూడా ప్ర‌శంస‌ల వర్షం కురిపించాడు. టీ-20 ఫార్మాట్‌లో ప్ర‌పంచంలోనే ర‌షీద్ ఉత్త‌మ స్పిన్న‌ర్ అని స‌చిన్ అన్నాడు.

click me!