వికెట్ తీసిన ఆనందంలో అసభ్య సంజ్ఞలు... పాకిస్తాన్ బౌలర్‌పై అభిమానుల ఆగ్రహం...

By Arun Kumar PFirst Published 11, Aug 2018, 5:28 PM IST
Highlights

వెస్టిండిస్ దీవుల్లో జరుగుతున్న కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో ఓ పాకిస్తానీ బౌలర్ చేసిన పనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్రిడా స్పూర్తిని మంటగలుపుతూ ఇలా ఓ అంతర్జాతీయ స్థాయి క్రికెటర్ ప్రవర్తిచడం సిగ్గుచేటని సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకూ ఆ బౌలర్ ఎవరు?  అభిమానులు అంతలా ఆగ్రహించేలా ఏం చేశాడో తెలుసుకోవాలంటే కింది స్టోరీ చదవండి. 

కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో పాకిస్తాన్ ఫేస్ బౌలర్ సోహైల్ తన్వీర్ అమెజాన్ వారియర్స్ తరపున ప్రాతినిద్యం వహిస్తున్నాడు. అయితే ఇతడు గురువారం కిట్టిస్‌ అండ్‌ నెవిస్‌ పాట్రియోట్స్‌ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో అతిగా ప్రవర్తించాడు. ఆ జట్టుకు చెందిన ఓ బ్యాట్ మెన్ ని అవుట్ చేసిన ఆనందంలో అసభ్యకరమైన సంజ్ఞ చేస్తూ కెమెరా కంటికి చిక్కాడు. దీంతో ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారి నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది.

క్రీడాస్పూర్తిని మరిచి ప్రవర్తించిన తన్వీర్ అవుటైన బ్యాట్ మెన్ వైపు తన రెండు మధ్య వేళ్లను చూపుతూ అసభ్యకరమైన సంజ్ఞలు చేశాడు. ఈ వీడియోను చూసిన క్రికెట్ అభిమానులే కాదు మాజీ క్రికెటర్లు సైతం సోహైల్ పనిని తప్పుబడుతున్నారు. 

ఈ ఘటన మ్యాచ్ రిఫరీకి సైతం ఆగ్రహం తెప్పించింది. దీంతో సోహైల్ మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధిస్తూ రిపరీ నిర్ణయం తీసుకున్నారు. మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు.  
 
Last Updated 9, Sep 2018, 10:54 AM IST